Five Star Award: ఆరోసారి 5 స్టార్‌ రేటింగ్‌ సాధించిన కంపెనీ ఇదే..

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రం కడపలో ఉన్న‌ ‘భారతి సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ మైన్‌’కు ఆరోసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 స్టార్‌ రేటింగ్‌ లభించింది.

పర్యావరణ పరిరక్షణ, విద్య, వైద్యం, పరిశుభ్రత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాల్లో స్థానికంగా చేసిన కృషికి భారతి సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ మైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. గనుల రంగంలో సుస్థిరాభివృద్ధి విధానాలు అమలుచేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న 68 మైనింగ్‌ సంస్థలకు కేంద్రం 2022–23 సంవత్సరానికి ఈ అవార్డులు అందజేసింది.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి 5, తెలంగాణ నుంచి 5 సంస్థలు ఈ అవార్డులు అందుకున్నాయి. ఆగ‌స్టు 7వ తేదీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ అవార్డులను ప్రదానం చేశారు. వచ్చే ఏడాది 7 ఉత్తమ సంస్థలకు 7 స్టార్‌ రేటింగ్స్‌ కూడా ఇస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. 

ఏపీ నుంచి అవార్డు అందుకున్న సంస్థలు ఇవే..
భారతి సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ మైన్‌ – కడప
జేఎస్‌­డబ్ల్యూ సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ – నంద్యాల
దాల్మి­యా సిమెంట్స్‌ నవాబ్‌పేట – తలమంచిపట్నం
అ­ల్ట్రా­టెక్‌ – తుమ్మలపెంట
శ్రీ జయజ్యోతి (మైహోం) సిమెంట్స్‌ – కర్నూలు

తెలంగాణ నుంచి అవార్డు అందుకున్న కంపెనీలు ఇవే..
మైహోం – చౌటుపల్లి–1 
టీఎస్‌ఎండీసీ – దేవాపూర్‌ (మంచిర్యాల) 
మైహోం – మెల్ల చెరువు
రైన్‌ సిమెంట్స్‌ – నల్గొండ 

#Tags