Bharat ke Anmol Award: సీనియర్ పాత్రికేయుడు నాగిళ్ల వెంకటేష్‌కు జాతీయ అవార్డు
గత రెండు దశాబ్దాలుగా జర్నలిజంలో అందిస్తున్న ఉత్తమ సేవలకు సీనియర్ పాత్రికేయుడు నాగిళ్ల వెంకటేష్‌ను ‘భారత్ కే అన్మోల్’ జాతీయ అవార్డు వరించింది.
ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో పద్మశ్రీ డాక్టర్ విజయకుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
దేశంలో వివిధ రంగాలలో అమూల్యమైన సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను గౌరవించేందుకు డాక్టర్ మొహమ్మద్ నిజాముద్దీన్ మరికొంత మందితో కలిసి 'భారత్ కే అన్మోల్' అవార్డులను నెలకొల్పారు. అలాగే జీకేపీఆర్ మీడియా హౌస్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ వెంకట కె గంజాం ఇందులో కీలక పాత్ర పోషించారు.
☛☛ Ts Government Announces dasarathi Award: నటేశ్వర శర్మకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారం
#Tags