TS Contract Employees Regularisation 2023 : గుడ్‌న్యూస్‌.. కాంటాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ.. తొలి సంత‌కం.. అలాగే జీతాలు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ కాంటాక్టు ఉద్యోగులకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. అలాగే సీఎం కేసీఆర్ కొత్త‌స‌చివాల‌యంలో తొలి సంతకం ఈ ఫైల్‌ఫైనే చేశారు.
K. Chandrashekar Rao, Telangana CM

ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఎంతోకాలంగా రెగ్యులరైజ్‌ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల ఎట్టకేలకు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సాకారమైంది. 

ఈ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తూ..
రాష్ట్రంలోని మొత్తం 10 శాఖల్లోని 40 విభాగాల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ రావు ధన్యవాదాలు తెలిపారు. 
ప్రభుత్వం నిర్ణయంతో 2,909 మంది జూనియర్‌ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్‌), 390 మంది పాలిటెక్నిక్‌, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జీతాలు కూడా పెంచుతూ..

తెలంగాణలోని పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మే డే కానుక ప్రకటించారు. పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ కార్మికుల వేతనాల పెంపునకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

పారిశుద్ధ్య కార్మికులకు రూ.వెయ్యి వేతనం పెంచాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెరగనున్నాయి. జీహచ్‌ఎంసీ, జలమండలి పారిశుద్ధ్య కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల కార్మికులకు వేతనాలు పెరగనున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.

#Tags