Free Coaching: ప‌లు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో (నాదర్‌గుల్‌) ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి రామారావు మార్చి 28న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్టేట్‌ సర్వీసెస్‌, గ్రూప్స్‌, బ్యాంకింగ్‌ సర్వీసెస్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఉద్యోగాలకు ఫౌండేషన్‌ కోరుల్లో 100 మందికి మూడు నెలల పాటు రెసిడెన్షియల్‌ విధానంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. గతంలో స్టడీ సర్కిల్‌ ద్వారా కోచింగ్‌ తీసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవొద్దన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

మార్చి 30 వరకు స్పాట్‌ అడ్మిషన్‌ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్టు తెలిపారు. డిగ్రీ మార్కుల ద్వారా కేటాయింపు ఉంటుందన్నారు.

ఎంపికై న వారు కుల, ఆదాయ, 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో హాజరు కావాలన్నారు. వివరాలకు 94405 21419, 81215 09153 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
 

#Tags