Flipkart 1 lac Jobs 2024 : ఫ్లిప్‌కార్ట్‌లో 1 లక్ష ఉద్యోగాలు... ఎక్కువ జాబ్స్ ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : రానున్న పండ‌గ‌ల సీజ‌న్ కోసం ఫ్లిప్‌కార్ట్ కంపెనీ భారీగా ఉద్యోగుల‌ను తీసుకోనున్న‌ది. Big Billion Days 2024 సేల్ కోసం లక్ష ఉద్యోగాల సృష్టించబోతున్నట్లు సెప్టెంబరు 4వ తేదీ (బుధవారం) ప్రకటనలో కంపెనీ తెలిపింది.

భారీగా ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఒక‌ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా సప్లయ్‌ చైన్‌ విభాగంలో 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. దీనివల్ల ఈ పండగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడడంతో పాటు స్థానిక కమ్యూనిటీకి ఉపాధి లభిస్తాయని తెలిపింది. సాధారణంగా పండగల వేళ ఇ-కామర్స్‌ కంపెనీలు ప్రకటించే ఈ ఉద్యోగాలు సీజనల్‌గా ఉంటాయి. ఏటా ఈ తరహా నియామకాలను చేపడుతూ ఉంటున్న విష‌యం తెల్సిందే.

భ‌ర్తీ చేయ‌నున్న ఉద్యోగాలు ఇవే..
మేనేజర్లు, వేర్‌ హౌస్‌ అసోసియేటర్లు, లాజిస్టిక్స్‌ కో-ఆర్డినేటర్లు, కిరాణా పార్ట్‌నర్లు, డెలివరీ డ్రైవర్స్‌ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. 

Job Mela: రేపే జాబ్‌మేళా.. టెన్త్‌/ఇంటర్‌ చదివిన వారికి అవకాశం

ఈ సారి కొత్త‌గా..
మహిళలు, దివ్యాంగులు, ఎల్‌జీబీటీక్యూఏఐ+ కమ్యూనిటీకి చెందిన వారినీ నియమించుకోనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. కొత్తగా ఉద్యోగాల్లో తీసుకునే వీరికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది.

#Tags