Government Employees : శుభవార్త.. ఈ ఉద్యోగులకు బోనస్.. మొత్తం ఎంతంటే..?
2022-23 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధం లేని బోనస్‌లను (తాత్కాలిక బోనస్‌లు) గరిష్టంగా రూ.7,000గా ఆర్థిక శాఖ నిర్ణయించింది.
గ్రూప్-సి ఉద్యోగులతోపాటు గ్రూప్-బి లోని ఉత్పాదక బోనస్ పరిధిలోకి రాని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 2022-23 అకౌంటింగ్ సంవత్సరానికి గానూ 30 రోజుల వేతనాలకు సమానమైన తాత్కాలిక బోనస్ మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ బోనస్‌కు..
31.3.2023 నాటికి సర్వీస్‌లో ఉండి 2022-23 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సర్వీస్ అందించిన ఉద్యోగులు మాత్రమే ఈ బోనస్‌కు అర్హులు. ఉద్యోగుల సగటు వేతనం లేదా గరిష్ట బోనస్ మొత్తం (ఏదీ తక్కువ ఉంటే అది) ఆధారంగా ఈ తాత్కాలిక బోనస్‌ను నిర్ణయిస్తారు.వారానికి 6 రోజుల పని విధానం పాటించే కార్యాలయాల్లో ఏడాదికి కనీసం 240 రోజులు మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలపాటు, వారానికి 5 రోజుల పని విధానం పాటించే కార్యాలయాల్లో అయితే కనీసం 206 రోజులు హాజరై ఉండాలి.