Business Woman Success Story : అత్త 'ఐడియా'.. కోడలు వ్యాపారం.. కోట్ల సంపాద‌న‌.. ఎలా అంటే..?

చాలా ఇళ్ల‌లో.. అత్తా కోడళ్ళకు అస‌లు ప‌డ‌దు. కొన్ని ఇళ్ల‌లో అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ఈ ఇంట్లో మాత్రం విచిత్రంగా అత్త ఇచ్చిన ఐడియాతో.. కొడ‌లు కోట్ల వ్యాపారం చేస్తుంది.

ఈ కోడలు లక్షాధికారి కావడానికి  అత్త కారకురాలయింది. ఆమె ఎలా ధనవంతురాలయింది? అత్త ఇచ్చిన ఐడియా ఏమిటి..? ఆమె చేసే వ్యాపారం ఏది ? మొద‌లైన విశేషాలు కోసం ఈ పూర్తి సక్సెస్ స్టోరీని చ‌ద‌వండి..

కొన్ని రోజులకే..
చెన్నైకి చెందిన సోనమ్ అనే యువతి అదే ప్రాంతానికి చెందిన అజయ్ అనే యువకున్ని పెళ్లి చేసుకుంది. చాలా మంది అత్తలు మాదిరిగా కాకుండా సోనమ్ అత్త 'ప్రేమలత' తనను సొంత కూతురిలాగా చూసుకునేది. అయితే కొన్ని రోజులకే  అత్త మరణించడంతో చాలా బాధపడి కృంగిపోయింది. ఆ తరువాత కొన్ని నెలలకు కోలుకున్న సోనమ్ ఒక రోజు తన అత్తా గదిని శుభ్రపరిచే సమయంలో ఆమెకు ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ ఆమెను గొప్ప పారిశ్రామికవేత్తగా మార్చేసింది.

☛ Success Story : ఎందుకు..? ఏమిటి..? ఎలా..? ఇదే నా స‌క్సెస్‌కు కార‌ణం..?

అత్త డైరీలో ఏముందంటే..?
సోనమ్ చేతికి దొరికిన దొరికిన ఆ డైరీలో ఎన్నెన్నో వంటలకు సంబంధించిన రెసిపీలు ఉండటం గమనించింది. వీటన్నినీ అలాగే ఎందుకు నిరుపయోగంగా వదిలేయాలి..? పది మందికి పంచితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఫుడ్ బిజినెస్ చేస్తే బాగుంటుందని భర్తతో కలిసి నిర్ణయించుకుంది. డైరీలో తనకిష్టమైన గోంగూర చట్నీ దగ్గర్నుంచి మాల్గోపొడి వరకు అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. ఆ తరువాత వీటిని ప్రయత్నించాలనుకుని అలాంటి వంటకాలు తయారు చేసి భర్త అజయ్‌తో దగ్గరి బంధువులకు అందించడం మొదలుపెట్టింది. ఆ వంటకాలు తిన్న చాలా మంది ఫోన్ చేసి చాలా రుచిగా ఉయన్నాయని మెచ్చుకున్నారు. ఇది ఆమెను మరింత ప్రోత్సహించేలా చేసింది. 

మన దేశంలో మాత్రమే కాకుండా..
ఒకప్పుడు వంట మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, అయితే అత్తయ్య డైరీ చూడగానే నాలో మార్పు వచ్చిందని చెబుతూనే 'ప్రేమ్ ఇటాసి' (Prem Eatacy) పేరుతో వ్యాపారం ప్రారభించించినట్లు చెప్పింది. ప్రారంభంలో సుమారు రూ.10 లక్షల పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించి రకరకాల వంటలు చేయడం మొదలు పెట్టింది. వీరి వ్యాపారం ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కూడా ఆర్డర్‌లను పొందగలిగే స్థాయికి ఎదిగింది. కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా సింగపూర్, అమెరికా నుంచి కూడా కస్టమర్లు సంప్రదించి తమ ఉత్పత్తులు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సోనమ్ భర్త అజయ్ తెలిపాడు. ఇప్పటి వరకు వీరు 21 రకాల ఊరగాయ, పొడి, చట్నీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువ మంది చట్నీ, మొలగపొడి, పుదీనా కొత్తిమీర చట్నీ వంటివి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.

☛ Inspirational Women Success Story : నా భర్త సవాలుకు సై కొట్టా.. నేడు కోట్ల‌కు అధినేత్రి అయ్యానిలా..

నెలకు లక్షల రూపాయలు సంపాద‌న‌తో..
వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న సోనమ్ ఈ క్రెడిట్ మొత్తం మా అత్తగారికి చెందుతుందని.. ఆమె డైరీ లేకుండా ఉంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండే దానిని కాదని వినయంగా వెల్లడించింది. ప్రస్తుతం వీరి ఉత్పత్తులు స్టోర్లలో మాత్రమే కాకుండా, ఈ కామర్స్ వెబ్‌సైట్లలో కూడా లభిస్తున్నాయి. వారి ఉత్పత్తులు మొత్తం ఆర్గానిక్ పద్దతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించుకోకుండా తయారు చేస్తున్నట్లు సమాచారం. వీరు ఈ బిజినెస్ ద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

➤ Women Success Stroy : సీఏ చదివిస్తే.. ఈ పని చేస్తావా అని చీవాట్లు పెట్టారు.. కానీ నేడు కోట్లు టర్నోవర్ చేస్తున్నానిలా..

#Tags