Job Fair: రేపు జాబ్‌మేళా

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చూపించేందుకు ఈ నెల 19వ తేదీ శనివారం విజయవాడ రమేష్‌ ఆస్పత్రి రోడ్డు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్‌ జిల్లా ఉపాధి అధికారి డి.విక్టర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్లిప్‌కార్డ్‌లో డెలివరీ బాయ్స్‌–100, డెలివరీ గరల్స్‌–100 పోస్టులు, నవతా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో వేర్‌ హౌస్‌ సూపర్‌వైజర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, హార్ట్‌వేర్‌, కస్టమర్‌ కేర్‌–మొత్తం 35 ఉద్యోగాలు, వరుణ్‌ మోటార్స్‌ కంపెనీలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా ఎన్‌సీఎస్‌.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికెట్‌ జిరాక్స్‌లు, ఆధార్‌ కార్డుతో శనివారం ఉదయం 9 గంటలకు మేళాకు హాజరు కావాల్సిందిగా కోరారు.

చదవండి: APPSC Group 1&2 Notification: త్వరలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు

#Tags