May 27th Holiday : మే 27వ తేదీన‌ సెల‌వు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌ష‌న్ : తెలంగాణ‌లో మే 27వ తేదీన‌(సోమ‌వారం) MLC ఎన్నిక‌లు ఉన్న విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో మే 27వ తేదీన సెల‌వు ఇవ్వాల‌ని MLC గ్రాడ్యుమేట్ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న‌ అభ్య‌ర్థులతో పాటు.. ఓట‌ర్లు కూడా కోరుతున్నారు.

అలాగే కాంగ్రెస్ MLC బ‌ట్మూరి వెంక‌ట్ మే 27వ తేదీన సెల‌వు ఇవ్వాల‌ని ECని క‌లిసి విన‌తిప‌త్రం ఇచ్చారు. అలాగే ఈయ‌న పోలింగ్ శాతం పెరిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్‌రాజ్‌ను కోరారు. MLC గ్రాడ్యుమేట్ ఎన్నిక‌లు ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తి ఓట‌రు సొంత జిల్లాల‌కు వెళ్లి ఓటేసేలా.. వేత‌నంతో కూడిన సెల‌వు ఇవ్వాల‌న్నారు. ఈ విష‌యంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్‌రాజ్ సానుకూలంగా స్పందించార‌ని కాంగ్రెస్ MLC బ‌ట్మూరి వెంక‌ట్ తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల తేదీని చెల్లింపు సెలవుగా పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు. అంతేగాక ఉద్యోగి ఓటర్ ఐడీని చూపించి యాజమాన్యం మే 27 న పెయిడ్ హాలిడే గా పరిగణించవచ్చని తెలిపారు. తద్వారా అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఓట్ల శాతం కూడా మెరుగుపడుతుందని ఈసీకి బల్మూరి వెంకట్ తెలియజేశారు.

పట్టభద్రులు ఓటు వేయాలంటే..

అలాగే మే 27న సెలవు ఇవ్వాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఆ రోజు వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉందని బీజేపీ పేర్కొంది. పట్టభద్రులు ఓటు వేయాలంటే ఆ రోజు సెలవు ప్రటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఈ ఎన్నిక కోసం 4.69 లక్షల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని కోరారు. దీనిపై ఎన్నికల సంఘం నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పోలింగ్ రోజు మే 27వ తేదీన‌ దాదాపు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అయితే పోలింగ్ జరిగే జిల్లాల్లో మాత్రమే హాలిడే ఇచ్చే అవకాశం ఉంది. ఒక వేళ మే 27వ తేదీ సెల‌వు ఇస్తే.. వ‌రుస‌గా రెండు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. మే 26వ తేదీన ఆదివారం ఉన్న విష‌యం తెల్సిందే.

#Tags