Government Employees Salary Increase 2024 : గుడ్‌న్యూస్‌.. ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎప్పటి నుంచో ఉద్యోగులకు భారీగా జీతాలు పెరగబోతున్నాయని వార్తలు వస్తున్న క్రమంలోనే ఇప్పుడు వారికి భారీ శుభవార్త అందబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేత‌నాలు పెంపు ఉంటుందని.. దీని కోసం ఉద్యోగులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 8వ వేతన సంఘం అంశంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 

రూ.18 వేల నుంచి రూ.26 వేల వ‌ర‌కు..ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉండగా.. 8వ వేతన సంఘం ఏర్పాటు చేసినట్లయితే.. ఈ ప్రతిపాదనలు స్వీకరించేందుకు సుమారు 12 నుంచి 18 నెలల సమయం పడుతుంది. ఇదే జరిగినట్లయితే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతుంది. ఉద్యోగులకు 8వ వేతన సంఘంతో పాటు... కేంద్రం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 7వ వేతన సంఘానికి 2.57 రెట్లతో పరిచయం చేసింది. ఇక్కడ కనీస వేతనం రూ.18 వేలుగా ఉంది. ఇదే ఇప్పుడు 8వ వేతన సంఘం తీసుకొస్తే.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా భారీగా పెరగొచ్చని.. ఇది 3.68 రెట్లు పెరిగే అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగినట్లయితే.. బేసిక్ శాలరీ పెరిగి.. ప్రస్తుతం ఉన్న రూ.18 వేల నుంచి రూ.26 వేలకు చేరుతుందన్నమాట. దీంతో ఒక్కసారిగా జీతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కారణంగానే రూ.8 వేలు పెరుగుతుంది. ఇంకా కొత్త మంత్రి వర్గం ఏర్పాటు తర్వాత.. DA పెంపు 50 శాతం దాటిన నేపథ్యంలో దీనిని కూడా కనీస వేతనంలోకి విలీనం చేస్తారని.. అప్పుడు కూడా ఇంకా ఇది పెరగొచ్చని తెలుస్తోంది.

☛ Government Teachers Transfers and Promotions 2024 : టీచ‌ర్లుకు గుడ్‌న్యూస్‌.. బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుద‌ల‌.. రూల్స్ ఇవే..

దీనిపై కేంద్రం నుంచి అధికారికంగా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. చాలా మీడియాల్లో ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి.

#Tags