ITI Admissions : ఐటీఐల్లో రెండో విడ‌త ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

రాజమహేంద్రవరం: పదో తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన అభ్యర్థులకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎల్‌ఆర్‌ఆర్‌ కృష్ణన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలతో iti.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా శనివారం నుంచి జూలై 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకుని రశీదు పొందాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం నుంచి జూలై 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ వెరిఫికేషన్‌ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. వివరాలకు 92940 50231, 78010 95303 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

TS Mega DSC 2024: జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన అధికారులు

#Tags