Govt ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తిటౌన్‌: జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికిగాను మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ బక్కన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కోపాలో 31, ఎలక్ట్రీషన్‌లో 5, ఫిట్టర్‌లో 12, సివిల్‌లో 11 మొత్తం 59 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. శనివారం నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని.. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ ఫోన్‌ నంబర్‌ 9849643932 సంప్రదించాలన్నారు.

also read: Telangana WDCW Department : ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

#Tags