3 Days Holidays: విద్యార్థులకు వ‌రుస‌గా 3 రోజులు సెల‌వులు.. ఎందుకంటే..?

సిర్పూర్‌(టి): జ్వరాల నేపథ్యంలో సిర్పూర్‌ (టి) బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలకు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే మూడు రోజులపాటు సెల వు ప్రకటించారు.

విద్యార్థులు చికిత్స పొందుతున్న మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని సెప్టెంబర్ 10న‌ కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా సందర్శించారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇద్దరు మినహా మిగిలిన వారు కోలుకున్నారని వైద్యులు తెలిపారు.

జ్వరాలతో పరేషాన్‌

సిర్పూర్‌(టి) బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఒకేసారి వందమంది వరకు జ్వరాల బారిన పడటంతో ఆందోళన మొదలైంది. సెప్టెంబర్ 9న‌ 20 మంది ఆరోగ్యం విషమించి అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలించారు. వీరిలో చాలామందికి చికున్‌గున్యా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

చదవండి: Inter Admissions Deadline Extended: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

అయితే చికున్‌ గున్యా నెగెటివ్‌ రాగా.. సాధారణ వైరల్‌ జ్వరాలతోనే విద్యార్థులు బాధపడుతున్నట్లు నిర్ధారించారు. చికిత్స అనంతరం సెప్టెంబర్ 10న‌ సాయంత్రం 18 మందిని డిశ్చార్జి చేశారు. మరో ఇద్దరు అక్కడే చికిత్స పొందుతున్నారు.

వారి ఆరోగ్యం కుదుటపడగానే వారిని డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. కాగా.. జ్వరాల తీవ్రత నేపథ్యంలో మంగళ, బుధ, గురువారం మూడురోజులపాటు గురుకుల పాఠశాలకు కలెక్టర్‌ సెలవులు ప్రకటించారు. ఈ మేరకు విద్యార్థులను ఇళ్లకు పంపించినట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

#Tags