TGSCHE: దోస్త్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ను జూలై 25న‌ నుంచి చేప డుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.

ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రిజి స్ట్రేషన్, జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు వెబ్‌ ఆప్షన్లు చేపడుతు న్నట్లు తెలిపారు. సీట్ల కేటా యింపు ఆగస్టు 6న ఉంటుందని, సీట్లు వచ్చిన విద్యార్థులు ఆగస్టు 9లోగా రిపోర్ట్‌ చేయాలని సూచించారు.

చదవండి: Nirmal Degree College: నిర్మల్‌ డిగ్రీ కళాశాల అరుదైన ఘనత

హైదరాబాద్‌లోని నేషనల్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ సంస్థలో నాలుగేళ్ల బీబీఏ కోర్సులో ప్రవేశాలను దోస్త్‌ ద్వారా ఈ ఏడాది నుంచి నిర్వహించాలని నిర్ణ యించినట్లు లింబాద్రి తెలిపారు. ప్రత్యేక కౌన్సె లింగ్‌లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.   

#Tags