RBI Online Quiz Competition For Degree Students: డిగ్రీ విద్యార్థులకు ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌.. రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ

బ్యాంకింగ్‌ రంగం, ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించనుంది. ఆర్‌బీఐ ఆవిర్భవించి 90 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర, జోనల్‌, జాతీయ స్థాయిలో జరుగనున్న ఈ పోటీల కు డిగ్రీ, తత్సమానమైన కోర్సులు చదువుతున్న (అండర్‌గ్రాడ్యుయేషన్‌) విద్యార్థులు అర్హులు.

Jobs In Amazon: గుడ్‌న్యూస్‌.. దేశ వ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలు, ప్రకటించిన అమెజాన్‌

ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 17లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇద్దరు విద్యార్ధులు కలసి టీమ్‌గా ఏర్పడాలి. వీరికి బ్యాంకింగ్‌, అర్థిక అక్షరాస్యతపై ఆన్‌లైన్‌లో క్విజ్‌ పోటీ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన వారిని జోనల్‌ స్థాయికి, అందులో విజయం సాధించిన వారు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 

క్విజ్‌ పోటీల్లో పాల్గొనడానికి 1999సెప్టెంబరు 1 తర్వాత పుట్టి 2024 సెప్టెంబరు 1 నాటికి 25 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులవుతారు. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన మొదటి ముగ్గురు విజేతలకు రూ.10 లక్షలు, రూ.8 లక్షలు, రూ.6 లక్షలు చొప్పున ప్రైజ్ మనీ అందిస్తారు. 

Open 10th Class & Inter Admissions: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఇదే

ఇక జోనల్ స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.5లక్షలు, రూ.4లక్షలు, రూ.3లక్షలు చొప్పున ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో వరుసగా రూ.2లక్షలు, లక్షన్నర, లక్ష చొప్పున నగదు బహుమతి అందిస్తారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం https://www.rbi90quiz.in/ అనే లింక్‌ను క్లిక్‌ చేయండి. 

 

#Tags