July 4th Schools and Colleges Holiday 2024 : రేపు స్కూల్స్‌, కాలేజీలు బంద్‌.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశ‌వ్యాప్తంగా రేపు స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వు రానుంది. నీట్‌‌‌‌ యూజీ పేపర్‌‌‌‌‌‌‌‌ లీకేజీకి నిరసనగా.. జూలై 4వ తేదీ (గురువారం) విద్యా సంస్థల భారత్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌కు పిలుపునిచ్చారు వివిధ విద్యార్థుల సంఘం నాయ‌కులు.

ఈ బంద్‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీలు య‌జ‌మాన్యాలు అంద‌రు సహకరించాలని ఎమ్మెల్సీ, ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు.

➤ July 17th Holiday 2024 : జూలై 17వ తేదీన‌ స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు.. ఎందుకంటే..?

ఇప్పటివరకు..
గత పదేండ్లలో 70 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని..దీనివల్ల దేశ ప్రతిష్ట మసకబారుతున్నదని ఆరోపించారు. జూలై 2వ తేదీన (మంగళవారం) నాంపల్లిలోని టీజేఏస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఐక్య విద్యార్థి, యువ జన సంఘాల మీడియా సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, డీవైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ, పీవైఎల్ నేతలు పాల్గొన్నారు. 

జూలై 4న విద్యా సంస్థల భారత్ బంద్‌కు..
వివిధ పోటీ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలం అయ్యింది. ఈ విషయాలపై దేశ ప్రధాని మౌనంగా ఎందుకు ఉన్నారు. దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ లీకేజీపై నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిబట్టి చూస్తే పేపర్ లీకేజీలకు బీజేపీ నేతలే కారణమని అనుమానాలు వస్తున్నాయి. ఈ ఎగ్జామ్ ల నిర్వాహణలోని లోపాలను నిరసిస్తూ జూలై 4న విద్యా సంస్థల భారత్ బంద్ నిర్వహిస్తున్నాం. బంద్‌‌‌‌‌‌‌‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. 

☛ July Month Holidays 2024 : జూలై నెల‌లో స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే సెల‌వులు ఇవే..!

24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను..
నీట్ సమస్యపై సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని యువ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలీమ్ పాష ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మౌనం వీడాలని కోరుతూ 4న భారత్ బంద్ కి పిలుపునిస్తున్నామని చెప్పారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ కోరారు. రాష్ట్రాలకే నీట్ పరీక్ష నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి రిక్సెస్ట్ చేశారు.

రేపు తరగతులు బహిష్కరించి..
నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్‌లో పాల్గొని, తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు తెలియజేయాలని కోరాయి. ఈ బంద్ కార‌ణంగా జూలై 4వ తేదీన‌ తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చు అవ‌కాశం ఉంది.

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను..

కేంద్రం నిర్వాకం వలన లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని, ఐఐటి ప్రవేశాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలని, యూనివర్సిటీల్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని, విద్యార్థులు, విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని కోరుతూ బంద్‌ చేస్తున్నామన్నారు.

#Tags