UPSC Civils 3rd Ranker Ananya Reddy : యూపీఎస్సీ సివిల్స్‌ టాపర్ అనన్య రెడ్డి పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌లే విడుద‌ల చేసిన సివిల్స్ 2023 ఫ‌లితాల‌ల్లో మ‌న తెలుగు బిడ్డ‌.. జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించిన విష‌యం తెల్సిందే.

అయితే ర్యాంక్‌తో.. ఈమెకు జాతీయ స్థాయిలో మంచి పేరు వ‌చ్చింది.  అయితే.. ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్, ఫెస్‌బుక్‌, టెలిగ్రామ్‌తో పాటు పలు సోషల్ మీడియాల్లో తన పేరుపై ఫేక్ అకౌంట్లు సృష్టించినట్టు గుర్తించారు.

☛ Civils Ranker Ananya Reddy Success Story: ఎలాంటి కోచింగ్‌ లేకుండానే.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో మూడో ర్యాంకు

నిరుద్యోగుల‌ నుంచి డబ్బులు కూడా..
మరోవైపు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, మీడియా ఛానెళ్లు తన పేరు మీద మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. నిరుద్యోగుల‌ నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టు తెలుసుకున్న అనన్య రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 27న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

☛ UPSC Civils Ranker Naga Bharath : మా అమ్మ చివ‌రి కోరిక ఇదే.. ఇందుకే యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..

#Tags