IAS Transfers: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

సాక్షి హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఎనిమిది మందిని ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ.. వాళ్లకు పోస్టింగ్‌లు ఖరారు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 20న రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ అయిన విషయం తెలిసిందే.. ఏ శరత్‌కు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, గృహనిర్మాణం మరియు సాధారణ పరిపాలన (స్మార్ట్ గవర్నెన్స్) శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వికాస్ రాజ్ నియమితులయ్యారు. జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్, స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మి నియమితులయ్యారు.

చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శిగా హరీశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధికా గుప్తా. మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 8 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది.

  • షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ కమిషనర్ గా TK శ్రీదేవి.
  • కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా  రిస్వి ఐఏఎస్ కు అదనపు బాధ్యతలు.
  • రెవిన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాయింట్ సెక్రెటరీగా హరీష్ ఐఏఎస్.
  • ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు తనకు బాధ్యతలు టి హరీష్ ఐఏఎస్ కు అప్పగించిన ప్రభుత్వం.
  • మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్ ఐఏఎస్.
  • MAUD డిప్యూటీ సెక్రటరీగా చెక్క ప్రియాంక ఐఏఎస్.
  • HACA లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ రెడ్డి.
  • మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా   శ్రీనివాస్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం.

#Tags