Free Civils Coaching: సివిల్‌ సర్వీస్‌ ఉచిత శిక్షణకు ప్రవేశపరీక్ష

విద్యారణ్యపురి : ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్వంలో సివిల్‌ సర్వీస్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఆగ‌స్టు 11న‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ కులాల సంక్షేమ శాఖ ఉమ్మడి వరంగల్‌ జిల్లా గౌరవ సంచాలకుడు డాక్టర్‌ కె.జగన్‌మోహన్‌ ఆగ‌స్టు 9న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. అ భ్యర్థులు తమ హాల్‌టికెట్లను సంబంధిత వెబ్‌సైట్‌ హెచ్‌టీటీపీ//టీఎస్‌స్టడీసర్కిల్‌.కో.ఇన్‌లో ఉన్నాయని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ ప్రవేశ పరీక్ష అనంతరం మెరిట్‌ ఆధారంగా ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారని ఆయన పేర్కొన్నారు.

చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే

‘అనుమతిలేని కళాశాలల్లో ప్రవేశాలు పొందొద్దు’

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అనుమతిలేని కళాశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందవద్దని కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.మల్లారెడ్డి ఒక ప్రకటనలో కోరా రు.

డిగ్రీ ప్రవేశాలు పొందిన విద్యార్థులు సద రు కళాశాలకు యూనివర్సిటీ అనుబంధ గు ర్తింపు ఉందా లేదా అని పరిశీలించుకోవాలన్నా రు. కొన్ని కళాశాలలు పేరు, అడ్రస్‌, మేనేజ్‌ మెంట్‌ను మార్చుకొని యూనివర్సిటీ అనుబంధంఉందని నమ్మించి ప్రవేశాలు చేపడుతున్నట్లు తమదృష్టికి వచ్చిందన్నారు. అలాంటి క ళాశాలల్లో చేరే విద్యార్థులకు విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు.
 

#Tags