Marriage Not Top Priority: పెళ్లి విషయంలో మారుతున్న అమ్మాయిల ధోరణి, అంత ముఖ్యం కాదంటున్నారు..

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఇది వరకు అయితే 18 ఏళ్లు రాగానే అమ్మాయిలకు పెళ్లి చేసేవారు. చదువు అయిపోగానే పెళ్లి చేసేస్తే సెటిల్‌ అయిపోయినట్లే అని భావించేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో మాకేం తక్కువ అన్నట్లు దూసుకుపోతున్నారు.

పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాదు, అమ్మాయిల మైండ్‌ సెట్‌లోనూ మార్పులు వచ్చాయి. అసలు లైఫ్‌లో పెళ్లి అంత ముఖ్యం కాదు, చేసుకోవాలన్న ఇంట్రెస్ట్‌ లేదంటున్నారు. చదువైపోయాక మంచి కెరీర్‌ ఏర్పరుచుకోవడమే అన్నింటి కంటే ముఖ్యమైన విషయంగా పరిగణిస్తున్నారు. అందుకే ఇప్పుడప్పుడే పెళ్లి వద్దనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది.

పెళ్లి అంటే అంత అవసరం ఏముంది? ఆర్థికంగా నిలదొక్కుకోవడమే జీవితంలో ముఖ్యమైన అంశంగా చూస్తున్నారు. పెళ్లి విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల ఛాయిస్‌ ఎలా ఉందన్నదానిపై యూనిసెఫ్‌ నిర్వహించిన సర్వేలో.. దాదాపు 75% మంది యువత.. పెళ్లి కంటే లైఫ్‌లో మంచి ఉద్యోగం సాధించి సెటిల్‌ అవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కేవలం  20% మంది మాత్రమే చదువు అయిపోయాక పెళ్లి చేసుకోవడం బెటర్‌ అని అభిప్రాయపడుతున్నారు. 
 

#Tags