గ్రూప్‌-1 క్వాలిఫైడ్‌ అభ్యర్ధులు ఆందోళన.. ఎందుకంటే..?

విజయవాడ: గ్రూప్‌-1 (2018) క్వాలిఫైడ్‌ అభ్యర్ధుల జూన్ 18వ తేదీన‌ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ ప్రతిష్టకు భంగం కలిగించారని అభ్యర్ధుల ఆందోళన చేపట్టారు. గ్రూప్‌-1 క్వాలిఫైడ్‌ అభ్యర్ధుల పేర్లను బహిర్గతం చేయడంపై మండి పడ్డారు. భిన్నాభిప్రాయాలుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్తో తేల్చుకోవాలని అభ్యర్ధులు సూచించారు. తమను అసమర్ధులుగా చిత్రీకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీకి గ్రూప్‌-1 క్వాలిఫైడ్‌ అభ్యర్ధులు ఫిర్యాదు చేశారు. అయితే హైకోర్టు స్టేపై డివిజన్‌ బెంచ్‌కు వెళ్లేందుకు సిద్ధమైనట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.
#Tags