డిపార్ట్‌మెంటల్ పరీక్షలు వాయిదా: ఏపీపీఎస్సీ
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆగస్టు 25 నుంచి జరగాల్సిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
కోవిడ్-19 నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని పలువురి నుంచి వచ్చిన అభ్యర్థనలతో వీటిని వాయిదా వేస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
#Tags