APPSC Group 1: గ్రూప్‌–1లో మెరిసిన సిక్కోలు బిడ్డలు

పొందూరు: ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గ్రూప్‌–1 ఫలితాల్లో పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన కూన రాకేష్‌ ప్రతిభ కనబరిచారు. స్టేట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ట్యాక్సెస్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. రాకేష్‌ తండ్రి కేవీఎం సత్యనారాయణ పిల్లలవలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి ధనలక్ష్మి గృహిణిగా ఉన్నారు.


డీఎస్పీగా ప్రదీప్తి
ఆమదాలవలస రూరల్‌: మండలంలో కొర్లకోట గ్రామానికి చెందిన పేడాడ ప్రదీప్తి గ్రూప్‌–1 ఫలితాల్లో విజయం సాధించడంతో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఏపీపీఎస్సీ ఫలితాలు గురువారం విడుదల కావడంతో ఈ ఫలితాల్లో ప్రదీప్తి తన ప్రతిభను చూపారు. ప్రదీప్తి తల్లిదండ్రులు అప్పారావు, సుగుణవేణి ఇద్దరు ఉపాధ్యాయులు కావడంతో వారి ప్రోత్సాహంతో గ్రూప్‌– 1కు చదువుతూ ఎంపికయ్యారు. ఆమె ప్రస్తుతం టెక్కలి సబ్‌డివిజన్‌ పరిధిలో ఎకై ్సజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.

చదవండిAPPSC Group 1: స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్ కమిషనర్‌గా భార్గవ్‌


ట్రెజరీ ఆఫీసర్‌గా ‘కోట’
ఆమదాలవలస రూరల్‌: మండలంలో కలివరం పంచాయతీ తమ్మయ్యపేట గ్రామానికి చెందిన కోట రాజశేఖర్‌ గ్రూప్‌–1 ఫలితాల్లో విజయం సాధించారు. ఈ ఫలితాల్లో విజయం సాధించి ట్రెజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. రాజశేఖర్‌ను తల్లిదండ్రులు కోట రామారావు, సీతమ్మ, గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు.

#Tags