AP Police Jobs Notification 2024 : రాష్ట్రంలో 20 వేల పోలీసు ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్ !
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ పోలీసు ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు.
రాష్ట్రావ్యాప్తంగా 20 వేలకు పైగా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల కొరత ఉందన్నారు. దీనికి అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మేము భారీగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్నారు గానీ.. నోటిఫికేషన్ మాత్రం ఇవ్వడం లేదు. ఇలా మాటలతోనే కాలయాపన చేస్తారేమో అని పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ..
త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా తెలిపారు.
#Tags