AP Police Constable Jobs Notification : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్... పూర్తి వివరాలు ఇవే...
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే 10,762 పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని హోం మంత్రి అనిత తెలిపారు.

అలాగే త్వరలో 6,100 ఉద్యోగాల నియామకం పూర్తవుతుందని చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా హోం మంత్రి ప్రకటించారు. 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అనుమతి రాగానే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. మొత్తం మీద APలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం మంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు.
#Tags