Success Story: రెండో ప్ర‌య‌త్నంలో గెలుపు

తండ్రి న‌డిచిన దారిలోనే న‌డుస్తూ.. తండ్రిలా పోలీస్ అధికారంలో ఉద్యోగం సంపాదించాలని త‌పించి, ఎస్ఐ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌ప‌డ్డారు. ఈ ప్ర‌య‌త్నంలోనే ప‌రీక్ష‌లో పాల్గొని విజయం అందుకున్నారు. ఈ యువ‌కుని ప్ర‌యాణం, కుటుంబ వివ‌రాల‌ను తెలుసుకుందాం..
Dileep success same as father

ఆదివారం ప్రకటించిన ఎస్సై ఫలితాలలో వరంగల్‌ కాశిబుగ్గ శాంతినగర్‌కు చెందిన లింగాల దిలీప్‌ సివిల్‌ ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. శాంతినగర్‌కు చెందిన లింగాల మోహన మురళి, స్వరూపరాణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక్క కూతురు ఉన్నారు. దిలీప్‌ తండ్రి మోహన మురళి నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Woman Success: ఇబ్బందుల్లో కూడా గ‌మ్యాన్ని సాధించింది

కాగా, దిలీప్‌ రెండో ప్రయత్నంలో సివిల్‌ ఎస్సైకు ఎంపికయ్యారని తండ్రి మోహన మురళి తెలిపారు. కాగా, దిలీప్‌ను ‘సాక్షి’ పలకరించంగా తన అన్న, చెల్లి, బావ ప్రోత్సాహంతో ఎస్సై ఉద్యోగం సాధించానని తెలిపారు. కార్పొరేటర్‌ నరేంద్రకుమార్‌, జాగృతి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పెండ్యాల సోనిబాబు, పలువురు.. దిలీప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

#Tags