పేదరికం
1. పేదరికాన్ని గణించడానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే భావన ఏది?
1. అమిత పేదరికం
2. మిత పేదరికం
3. సాపేక్ష పేదరికం
4. నిరపేక్ష పేదరికం
ఎ) 1 మాత్రమే
బి) 1, 2
సి) 3 మాత్రమే
డి) 3, 4
- View Answer
- సమాధానం: బి
2. కిందివాటిలో ఆదాయ అసమానతలకు సంబంధించిన భావన ఏది?
ఎ) పేదరిక గీత
బి) నిరపేక్ష పేదరికం
సి) సాపేక్ష పేదరికం
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: సి
3. ఒక వ్యక్తి తన కనీస జీవిత అవసరాలను తీర్చుకోలేని స్థితిని ఏమంటారు?
ఎ) సాపేక్ష పేదరికం
బి) నిరపేక్ష పేదరికం
సి) అల్ప మానవాభివృద్ధి
డి) నికర ఆర్థిక సంక్షేమం
- View Answer
- సమాధానం: బి
4. పేదవారి ఆదాయాల్లో ఉండే తేడా ఆధారంగా వారిని వర్గీకరించడానికి వినియోగించే సూచీ ఏది?
ఎ) సీన్ పేదరికం సూచీ
బి) గిఫెన్ వైపరీత్యం
సి) లాస్పియల్ సూచీ
డి) మార్షల్ ఎడ్జవర్త్ సూచీ
- View Answer
- సమాధానం: ఎ
5. ‘పేదరికం గీతగా నిర్ణయించిన వినియోగ వ్యయం కంటే తక్కువ వినియోగ వ్యయం చేసే వారందరూ పేదవారే’ అని తెలిపేది?
ఎ) పొదుపు రేటు
బి) పెట్టుబడి రేటు
సి) తలల లెక్కింపు నిష్పత్తి
డి) గినీ సూచీ
- View Answer
- సమాధానం: సి
6. 1979లో ప్రణాళికా సంఘం నియమించిన టాస్క్ఫోర్స్ దేని ప్రాతిపదికగా కనీస వినియోగ వ్యయాన్ని నిర్ణయించింది?
ఎ) కనీస పోషక ఆహార స్థాయి
బి) ఆహార వస్తువుల సముదాయం
సి) తలసరి ఆదాయం
డి) వ్యష్టి ఆదాయం
- View Answer
- సమాధానం: ఎ
7. ‘కనీస జీవన ప్రమాణాలను కూడా పొంద లేని స్థితే పేదరికం’ అని నిర్వచించినది?
ఎ) ప్రపంచ వాణిజ్య సంస్థ
బి) కేంద్ర ప్రభుత్వం
సి) ప్రపంచ బ్యాంకు
డి) ఆసియా అభివృద్ధి బ్యాంకు
- View Answer
- సమాధానం: సి
8. భారత ఆర్థిక వ్యవస్థను ‘గాజు తెర ఆర్థిక వ్యవస్థ’గా వర్ణించింది ఎవరు?
ఎ) గౌతమ్ మాథుర్
బి) రంగరాజన్
సి) కౌశిక్ బసు
డి) ఎం.ఎస్. స్వామినాథన్
- View Answer
- సమాధానం: ఎ
9. పేదరికం అనుభవించే వారి బాధను గుడ్డివాడు సైతం చూడగలడని పేర్కొన్నది?
ఎ) రఘురామ్ రాజన్
బి) వై.వి.రెడ్డి
సి) కౌశిక్ బసు
డి) అమర్త్యసేన్
- View Answer
- సమాధానం: డి
10. ‘పేదరికం అనే సముద్రంలో మనం ఒక్కరమే ఒక దీవిలో సంతోషంగా జీవించలేం’ అని పేర్కొన్నది?
ఎ) డి.సుబ్బారావు
బి) అబ్దుల్ కలాం
సి) ఎం.ఎస్. స్వామినాథన్
డి) రంగరాజన్
- View Answer
- సమాధానం: సి
11. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించడం కోసం అవసరమైన విధానాన్ని సూచించడానికి 2008లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడెవరు?
ఎ) ఎన్.సి. సక్సేనా
బి) రఘురామ్ రాజన్
సి) వై.వి.రెడ్డి
డి) డి.సుబ్బారావు
- View Answer
- సమాధానం: ఎ
12. పట్టణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించడానికి ఏర్పాటైన కమిటీ ఏది?
ఎ) దండేకర్ కమిటీ
బి) కేల్కర్ కమిటీ
సి) హషీమ్ కమిటీ
డి) రఘురామ్ రాజన్ కమిటీ
- View Answer
- సమాధానం: సి
13. ‘ప్లానింగ్ అండ్ ద పూర్’ గ్రంథకర్త?
ఎ) గౌరవ్దత్
బి) మిన్హాస్
సి) ఓజా
డి) బర్దన్
- View Answer
- సమాధానం: బి
14. ‘Has Poverty Declined, Since Economic Reforms’ గ్రంథకర్త?
ఎ) ఓజా
బి) బర్దన్
సి) మిన్హాస్
డి) గౌరవ్దత్
- View Answer
- సమాధానం: డి
15. పేదరికం అంచనా పద్ధతిని సమీక్షించడానికి 2005లో ప్రణాళికా సంఘం నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షులెవరు?
ఎ) సురేష్ టెండూల్కర్
బి) రంగరాజన్
సి) గౌరవ్దత్
డి) డి.సుబ్బారావు
- View Answer
- సమాధానం: ఎ
16. భారత్లో గ్రామీణ పేదరికాన్ని అంచనావేయడానికి విశేష కృషిచేసినవారు?
ఎ) దండేకర్
బి) ఓజా
సి) మిన్హాస్
డి) లక్డావాలా
- View Answer
- సమాధానం: సి
17. 2012లో సురేష్ టెండూల్కర్ సూచించిన పేదరిక అధ్యయన పద్ధతిని సమీక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?
ఎ) దండేకర్ కమిటీ
బి) రంగ రాజన్ కమిటీ
సి) షా కమిటీ
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: బి
18. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ గ్రంథకర్త?
ఎ) అమర్త్యసేన్
బి) గౌరవ్దత్
సి) రఘురామ్ రాజన్
డి) ఓజా
- View Answer
- సమాధానం: ఎ
19. పేదరిక అంతరాన్ని ఏ విధంగా గణిస్తారు?
ఎ) బీపీఎల్ జనాభా మొత్తం జనాభా ×100
బి) (దారిద్య్రరేఖ - బీపీఎల్ ప్రజల సగటు ఆదాయం) / దారిద్య్రరేఖ
సి) (గ్రామీణ పేదరికం - పట్టణ పేదరికం) / గ్రామీణ పేదరికం
డి) (ఆదాయం - వినియోగ వ్యయం) / ఆదాయం
- View Answer
- సమాధానం: బి
20. తలల లెక్కింపు నిష్పత్తిని గణించే పద్ధతి?
ఎ) బీపీఎల్ జనాభా మొత్తం జనాభా ×100
బి) (ఆదాయం - వినియోగ వ్యయం) ఆదాయం
సి) (గ్రామీణ పేదరికం - పట్టణ పేదరికం) / గ్రామీణ పేదరికం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
21. సాపేక్ష పేదరికాన్ని కొలవడానికి ఉపయోగపడేది?
ఎ) లారెంజ్ వక్ర రేఖ
బి) సేన్ సూచీ
సి) గిఫెన్ వైపరీత్యం
డి) పైవేవికావు
- View Answer
- సమాధానం: ఎ
22. ‘పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ గ్రంథకర్త?
ఎ) అమర్త్యసేన్
బి) గౌతమ్ మాథుర్
సి) రాజా చెల్లయ్య
డి) దాదాబాయి నౌరోజీ
- View Answer
- సమాధానం: డి
23. ‘పావర్టీ ఇన్ ఇండియా’ గ్రంథకర్త?
ఎ) రాబిన్ సన్
బి) దండేకర్, నీలకాంత్ రత్
సి) మార్టిన్ రావెల్లిన్
డి) లక్డావాలా
- View Answer
- సమాధానం: బి
24. Augmented Poverty Line అనే భావనను అభివృద్ధి పరిచింది?
ఎ) ప్రణాళికా సంఘం
బి) 5వ ఆర్థిక సంఘం
సి) 7వ ఆర్థిక సంఘం
డి) 14వ ఆర్థిక సంఘం
- View Answer
- సమాధానం: సి
25. Poverty Gap అనే భావనను అభివృద్ధి పరిచింది?
ఎ) గౌరవ్ దత్, మార్టిన్ రావెల్లిన్
బి) లక్డావాలా
సి) అమర్త్యసేన్
డి) దండేకర్, రత్
- View Answer
- సమాధానం: ఎ
26. కిందివాటిలో పేదరికానికి కారణం కానిది?
ఎ) ఆదాయ అసమానతలు
బి) నిరుద్యోగం
సి) జనాభా పెరుగుదల
డి) వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఎక్కువగా ఉండటం
- View Answer
- సమాధానం: డి
27. వృద్ధి జరిగితే తలసరి ఆదాయం పెరిగి పేదరికం దానంతట అదే తగ్గుతుందని తెలిపే సిద్ధాంతం ఏది?
ఎ) జనాభా పరిణామ సిద్ధాంతం
బి) ట్రికిల్ డౌన్ థియరీ
సి) ఆదాయ సిద్ధాంతం
డి) పెట్టుబడి సిద్ధాంతం
- View Answer
- సమాధానం: బి
28. పేదరిక అంతరాన్ని శాతాల్లో వ్యక్తపరిస్తే కిందివాటిలో దేన్ని తెలుసుకోవచ్చు?
ఎ) పేదరిక అంతరం సూచీ
బి) గినీ సూచీ
సి) లాఫర్ వక్రరేఖ
డి) లారెంజ్ వక్రరేఖ
- View Answer
- సమాధానం: ఎ
29. టెండూల్కర్ కమిటీ అంచనాల ప్రకారం భారత్లో పేదరికం ఎంత శాతం?
ఎ) 34.5
బి) 36.5
సి) 37.2
డి) 38.2
- View Answer
- సమాధానం: సి
30. పేదరిక రేఖను నిర్ణయించడానికి మన్నికైన వస్తువులతో పాటు విద్య, ఆరోగ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నది?
ఎ) టెండూల్కర్ కమిటీ
బి) నేషనల్ శాంపుల్ సర్వే
సి) కేంద్ర గణాంక సంస్థ
డి) హషీమ్ కమిటీ
- View Answer
- సమాధానం: ఎ
31. పేదరిక అంచనాలకు ఆధారం?
ఎ) ఆదాయ అసమానతలు
బి) NSSO సేకరించే వినియోగ వ్యయ దత్తాంశం
సి) పనిలో పాలు పంచుకునే రేటు
డి) ఉద్యోగితపై NSSO జరిపే సర్వే
- View Answer
- సమాధానం: బి
32. పదకొండో ప్రణాళిక కాలంలో 2012 చివరి నాటికల్లా పేదరికాన్ని ఎంత శాతానికి తగ్గించా లని లక్ష్యంగా పెట్టుకున్నారు?
ఎ) 10 శాతం
బి) 15 శాతం
సి) 18 శాతం
డి) 20 శాతం
- View Answer
- సమాధానం: ఎ
33. దేశంలోని పేదరికాన్ని అంచనా వేయడానికి 30 రోజుల్లో 5 ఆహారేతర వస్తువులను మినహాయించి అన్ని రకాల వస్తువులపై చేసిన వినియోగ వ్యయాన్ని లెక్కించే పద్ధతి?
ఎ) మిక్స్డ్ రీకాల్ పీరియడ్
బి) యూనిఫాం రీకాల్ పీరియడ్
సి) పేదరిక వ్యత్యాసం
డి) కనీస జీవనావసర వినియోగ వ్యయ పద్ధతి
- View Answer
- సమాధానం: బి
34. అయిదు రకాల ఆహారేతర వస్తువులపై 365 రోజుల్లో, ఇతర వస్తువులపై 30 రోజుల్లో చేసే వినియోగ వ్యయాన్ని లెక్కించే పద్ధతి?
ఎ) పేదరిక వ్యత్యాసం
బి) వ్యయాల మదింపు పద్ధతి
సి) యూనిఫాం రీకాల్ పీరియడ్
డి) మిక్స్డ్ రీకాల్ పీరియడ్
- View Answer
- సమాధానం: డి
35. 1967-68లో గ్రామీణ భారతదేశంలో పేదరికాన్ని మిన్హాస్ ఎంతగా అంచనా వేశారు?
ఎ) 32.1 శాతం
బి) 34.1 శాతం
సి) 37.1 శాతం
డి) 39.1 శాతం
- View Answer
- సమాధానం: సి
36. 2011-12లో రంగరాజన్ కమిటీ అభిప్రాయం ప్రకారం ఎంత శాతం జనాభా పేదరిక రేఖకు దిగువన ఉన్నారు?
ఎ) 17 శాతం
బి) 18.7 శాతం
సి) 19.9 శాతం
డి) 29.6 శాతం
- View Answer
- సమాధానం: డి
37. 2011-12లో రంగరాజన్ కమిటీ అభిప్రాయం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక శాతం?
ఎ) 30.95 శాతం
బి) 31.15 శాతం
సి) 31.96 శాతం
డి) 32.56 శాతం
- View Answer
- సమాధానం: ఎ
38. 2011-12లో రంగరాజన్ కమిటీ అభిప్రాయం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పేదరిక శాతం?
ఎ) 24.4 శాతం
బి) 25.4 శాతం
సి) 26.4 శాతం
డి) 27.4 శాత
- View Answer
- సమాధానం: సి
39. NSSO 66వ రౌండ్ (2009-10) ప్రకారం భారత్లో పేదరిక రేఖ దిగువన ఉన్న జనాభా?
ఎ) 29.8 శాతం
బి) 31.5 శాతం
సి) 31.7 శాతం
డి) 32.5 శాతం
- View Answer
- సమాధానం: ఎ
40. NSSO 66వ రౌండ్లో పేదరిక అంచనాలకు ఆధారాలు?
ఎ) ఆదాయం పెట్టుబడి
బి) లాస్పియర్ సూచీ, వినియోగ వ్యయం
సి) ఫిషర్ సూచీ, గృహ వినియోగ వ్యయ సర్వే
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
41. భారత్లో పేదరిక అంచనాలను మొదటగా రూపొందించిన వారు?
ఎ) బర్దన్
బి) మిన్హాస్
సి) దండేకర్
డి) దాదాబాయి నౌరోజీ
- View Answer
- సమాధానం: డి