Asst Professor Jobs : ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అప్లై చేశారా? చివరి తేదీ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ)..అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. నోటిఫికేషన్‌ ప్రకారం..సెప్టెంబర్‌ 9తో దరఖాస్తు గడువు ముగియడంతో తాజాగా ఈనెల 16 వరకు పొడిగించారు. ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది.

కాగా ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇదివరకే నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా మొత్తం 480 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 488.

CBSE Board Exam 2025 Registration Deadline: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఇదే


»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ –బ్రాడ్‌ స్పెషాలిటీ(క్లినికల్‌/నాన్‌ క్లినికల్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–సూపర్‌ స్పెషాలిటీస్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ(ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంసీహెచ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

»    వయసు: ఓసీలకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 47 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆ«ధారంగా ఎంపిక చేస్తారు.

Apply For 50,000 Govt Job Vacancies: భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. మొత్తం ఖాళీలు, చివరి తేదీ వివరాలివే..

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్‌ 16
»    వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/
 

#Tags