KGBV Inter Admissions: కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తులు..
ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు కస్తుర్బా గాంధీ బాలికల గురుకుల కళాశాల..
పుట్టపర్తి: జిల్లాలోని ఉన్న కస్తూర్భా బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ మీనాక్షి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నల్లచెరువు, తనకల్లు, గాండ్లపెంట, కనగానిపల్లి గురుకులాల్లో గ్రూపుల్లో కూడా మార్పు చేశామన్నారు. నల్లచెరువులో ఎంఈసీకి బదులు ఎంపీసీ, తనకల్లులో ఎంఈసీకి బదులు బైపీసీ, గాండ్లపెంటలో ఎంఈసీకి బదులు ఎంపీసీ, కనగానపల్లిలో ఎంఈసీకి బదులు ఎంపీసీ గ్రూపులను ప్రవేశ పెట్టామన్నారు.
#Tags