AP ICET Hall Tickets Released: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టికెట్స్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఏపీ ఐసెట్‌) హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. అభ్యర్థులు  రిజిస్ట్రేషన్‌ నంబర్‌, ఎగ్జామ్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో హాల్‌టికెట్‌ (AP ICET Hall Ticket 2024) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు ఏపీ ఐసెట్‌ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఈసారి  AP ICET 2024 పరీక్షను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. 

ఏపీ ఐసెట్‌ పరీక్ష షెడ్యూల్‌
మే 6,7 తేదీల్లో ఐసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఐసెట్ 2024 పరీక్ష జరుగనుంది. ఉదయం సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం సెషన్‌లో మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

జూన్‌ 20 ఫలితాలను వెల్లడిస్తారు. ఏపీ ఐసెట్‌ హాల్‌టికెట్స్‌ కోసం https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx డైరెక్ట్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి. 

#Tags