DSC 2024 Notification: విడదలైన డీఎస్‌సీ నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు..!

టీచర్ల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ శుభవార్త.. విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ డీఎస్‌సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వివరించారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 107, స్కూల్‌ అసిస్టెంట్లు 164, టీజీటీ పోస్టులు 115 భర్తీ కానున్నాయి. 2018 సిల బస్‌ మేరకే టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్టీ) జరగనుంది. సోమవారం నుంచి ఈనెల 21 వరకూ ఫీజు చెల్లింపునకు గడువు విధించారు. 22 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 5 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. రోజూ రెండు విడతలుగా పరీక్షలు ఉంటాయి.

AP TET 2024 Syllabus Details : ఏపీ టెట్‌-2024 పూర్తి సిల‌బ‌స్ ఇదే.. మంచి మార్కులు సాధించాలంటే ఇవే కీలకం..

ఉదయం 9.30 నుంచి 12 వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల రెండో విడత ఉంటుంది. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 1న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 2న ఫైనల్‌ కీ విడుదల, ఏప్రిల్‌ 7న డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లు కాగా, రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు మరో 5 ఏళ్లు అంటే 54 ఏళ్ల వయోపరి మితి పెంచారు. ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌, కన్వీనర్‌గా డీఈఓ వ్యవహరించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు.

వైఎస్సార్‌టీఎఫ్‌ హర్షం

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలపై వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫెడరేషన్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కె. ఓబుళపతి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు.

#Tags