భారతదేశ శీతోష్ణస్థితి

ముఖ్యాంశాలు:

  1. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ‘వాతావరణం’ అంటారు. ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ సమయంలో కూడా చాలా తీవ్రంగా మారుతుంటాయి.
  2. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనపర్చితే వాతావరణ పరిస్థితులను ‘శీతోష్ణస్థితి’ అంటారు. ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలి వేగం, గాలిలోతేమ, వర్షపాతం, వాతావరణంలోని ముఖ్యాంశాలు.
  3. దేశంలోని వివిధ ప్రాంతాలలో గల ఉష్ణోగ్రత, వర్షపాతాలలో తేడాను ‘క్లైమోగ్రాఫ్’లు తెలియజేస్తాయి. అక్షాంశం, భూమికి - నీటికి మధ్యగల సంబంధం, భౌగోళిక స్వరూపం మరియు ఉపరితల గాలి ప్రసరణలు శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే శీతోష్ణస్థితి కారకాలు.
  4. భూమధ్యరేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్ది వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు తగ్గరగా ఉన్నందువల్ల సగటు ఉష్ణ్రోగ్రతలు ఉత్తర ప్రాంతంకంటే ఎక్కువగా ఉంటాయి.
  5. భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది. నిదానంగా చల్లబడుతుంది. అందువల్ల సముద్రం శీతోష్ణస్థితులను ప్రభావితం చేస్తుంది.
  6. మైదాన ప్రాంతం కన్నా పర్వత ప్రాంతాలు ఎత్తులో ఉన్నందువల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
  7. భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహం వల్ల ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను ‘జెట్ ప్రవాహం’ అంటారు.
  8. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికి కారణమౌతాయి.
  9. సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూముల్లో ‘తొలకరిజల్లులు’ పడతాయి. వీటిని ‘మామిడి జల్లులు’ అంటారు.
  10. భారతదేశంలోని శీతోష్ణస్థితి ఋతుపవనాల వల్ల గణనీయంగా ప్రభావితమౌతుంది.
  11. మానవుల కారణంగా భూగోళం వేడేక్కుతోంది. అడవులను నరికివెయ్యటం దీనికి ప్రధానమైన కారణం.
  12. ‘వాతావరణ మార్పు’ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నది. దాని వల్ల మనమందరం ప్రభావితమౌతాం.

కీలక భావనలు:

  1. క్లైమోగ్రాఫ్: శీతోష్ణస్థితిలోని ముఖ్యమైన అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు వర్షపాతాలు ‘క్లైమాటో గ్రాఫ్’ చూపిస్తుంది.
  2. వాతావరణం: ఒక ప్రాంతంలో, ఒక నిర్ధిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ‘వాతావరణం’ అంటారు.
  3. ఋతుపవనాలు: కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని మనం ‘ఋతుపవనాలు’ అంటామ. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి ఋతుపవన కాలంలో సంభవిస్తుంది.
  4. సూర్యపుటం: భూమి ఉపరితలానికి, సూర్యుని నుంచి వచ్చు ఉష్ణోగ్రతను సూర్యపుటం (Isolation) అంటారు.
  5. పీడన మేఖలలు: పవనాలు ప్రపంచ వ్యాప్తంగా వీస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు గల ప్రాంతంలో అల్పపీడన మేఖల ఏర్పడును. అధిక పీడన ప్రాంతంలో ‘పీడన మేఖలలు’ ఏర్పడును.
  6. భూగోళం వేడెక్కడం: అడవుల నరికివేత, పారిశ్రామికీకరణ వల్ల కాలుష్యం మొదలైన అంశాల వల్ల కార్బన్‌డై ఆక్సైడులు పెరిగి పోయి భూగోళం వేడెక్కుతుంది.
  7. జెట్ ప్రవాహం: భూమి ఉపరితలంపై వీచు వాయు ప్రవాహాలను ‘జెట్ ప్రవాహాలు’ అంటారు.

వ్యాసరూపక ప్రశ్నలు:
1. భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలను వివరించండి.
జ:

  1. శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలు:
    ఎ) అక్షాంశం
    బి)భూమి-నీటికి మధ్య గల సంబంధం
    సి)భౌగోళిక స్వరూపం
    డి) ఉపరితల గాలి ప్రసరణ
  2. భూమధ్య రేఖ నుంచి ధృవాలవైపు వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి.
  3. భారత దేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకి దగ్గరగా ఉష్ణ మండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి.
  4. భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది. నిదానంగా చల్ల బడుతుంది. దీని వల్ల శీతోష్ణస్థితి అనేక రకాలుగా ప్రభావితం అవుతాయి.
  5. మైదాన ప్రాంతాల కంటే పర్వత ప్రాంతాలు తక్కువ ఉష్ణోగ్రతలను కల్గి ఉంటాయి.
  6. భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను ‘జెట్ ప్రవాహాం’ అంటారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు చల్లబడుతాయి.
  7. భారతదేశ శీతోష్ణస్థితి ఋతుపవనాల వల్ల గణనీయంగా ప్రభావితం అవుతుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి ఋతుపవనాల కాలంలో సంభవిస్తుంది.
2. భూగోళం వేడెక్కడంలో మానవుని పాత్ర తెలపండి.
జ:
  1. పారిశ్రామిక విప్లవం తరువాత వేడెక్కటానికి కారణం మానవచర్యలే. ప్రస్తుతం భూమి వేడెక్కటాన్ని మానవ కారణంగా భూగోళం వేడెక్కటం అంటారు.
  2. శిలాజ ఇంధనాల వినియోగం పెరగటం వల్ల, వాతావరణంలో హరితగృహ వాయువులు పెరుగటవల్ల భూమి వేడెక్కుతుంది.
  3. అడవుల వినాశనం, నరికి వెయ్యటం వల్ల భూగోళం వేడెక్కుతుంది.
  4. కృత్రిమ రసాయనిక ఎరువులను విరివిగా వినియోగించటం వల్ల భూసార శైథిల్యంతో పాటు కాలుష్యం నకు కారణంగా మారి భూగోళం వేడెక్కుటకు దోహదపడుతుంది.
  5. ఆటోమొబైల్స్ వాడకం పెరుగుటవల్ల అధిక మొత్తంలో పెట్రోలియం ఉత్పత్తులను వినియోగించటం వల్ల గాలిలోనికి అధికంగా కార్బన్-డై-ఆక్సైడులు విడుదల అవుతూ, భూగోళం వేడెక్కుటకు కారణమౌతున్నాయి.
  6. ఆధునిక జీవన విధానంలో టీవీలు, ఫ్రిజ్‌లు, ఎయిర్ కండీషన్స్ లాంటి గృహోపకరణాల వాడకం పెరిగింది. ఫలితంగా భూగోళం వేడెక్కుటకు దోహదకారకములైన వాయువులను ఈ ఉపకరణాలు విడుదల చేస్తున్నాయి.
  7. విద్యుత్‌శక్తి ఉత్పత్తికై అధిక మొత్తంలో బొగ్గు వాడకం వల్ల ప్రధానంగా కార్బన్-డై-ఆక్సైడ్ అధికంగా వాతావరణంలో చేరి భూగోళం వేడెక్కుతుంది.
3. భూగోళం వేడెక్కడంతో శీతోష్ణస్థితిలో మార్పులు ఏవిధంగా కారణమవుతాయి? భూగోళం వేడెక్కడాన్ని తగ్గించుటకు కొన్ని చర్యలను సూచించండి.
:
  1. ప్రస్తుతం భూమి వేడెక్కడాన్ని మానవ కారణంగా భూగోళం వేడెక్కటంగా (AGM-Anthropogenic Global Warming) అంటారు.
  2. ఈ సమస్యను ఎదుర్కొటానికి శీతోష్ణస్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఒకటి ఏర్పడింది.
  3. మానవ కారణంగా భూగోళం వేడెక్కటాన్ని తగ్గించటానికి, వాతావరణ మార్పు పై ప్రపంచ దేశాల మధ్య ఒక ఒప్పందం ఏర్పాటుకు అనేక సమావేశాలను ఈ సంఘం నిర్వహించింది.
  4. 2013లో పోలాండ్‌లోని వార్సాలో దీనికై ఒక సమావేశం జరిగింది.
  5. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. వాతావరణంలోని హరితగృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగం, ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి.
  6. శిలాజ ఇంధనాల వినియోగం ద్వారానే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నది ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన. శిలాజ ఇంధనాలు వినియోగించకపోతే, తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి.
  7. బొగ్గు వాడకాన్ని తగ్గించుటకు సౌరశక్తితో లేదా జలశక్తితో హైడ్రో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయాలి.
  8. అడవుల నరికివేతను అరికట్టాలి. సామాజిక అడవులను పెంపొందించాలి.
  9. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చాలి, వ్యవసాయంలో ఎక్కువగా యంత్రాలతో పనులు చేయాలి.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:
1. కింది వాక్యాలను చదివి అవి వాతావరణానికి లేదా శీతోష్ణస్థితికి ఏ అంశానికి ఉదాహరణో చెప్పండి.

అ) హిమాలయాల్లో అనేక మంచు పర్వతాలు గత కొద్ది సంవత్సరాలలో కరిగిపోయాయి.
ఆ) గత కొన్ని దశాబ్దాలలో విదర్భ ప్రాంతంలో కరువులు ఎక్కువగా సంభవించాయి.
జ: అ) శీతోష్ణస్థితి ఆ) శీతోష్ణస్థితి

2. కింది వాటిని జత పరచండి.

అ) తిరువనంత పురం
1. భూమధ్యరేఖకు దూరంగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
ఆ) గ్యాంగ్‌టన్
2. భూమధ్యరేఖకు దగ్గరగా ఉంది. కాని సముద్రానికి దగ్గరగా లేదు. వర్షపాతం తక్కువ
ఇ) అనంతపురం
3. సముద్రానికి దగ్గరగా ఉంది. శీతోష్ణస్థితి పై సముద్ర {పభావం ఎక్కువ
జ: అ) - 3
ఆ) - 1
ఇ) - 2

3. కొండ ప్రాంతాలలోని, ఎడారులలోని శీతోష్ణస్థితులను ప్రబావితం చేసే అంశాలను వివరించండి.
జ:
  • సముద్రమట్టం నుంచి ఎత్తుకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కనుక పర్వతాలు, కొండల పై ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
  • ఎడారులలో అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప వర్షపాతం ఉంటుంది. ఋతుపవనాలు వీచే మార్గంలో ఆరావళీ పర్వత శ్రేణులవల్ల రాజస్థాన్‌లో ధార్ ఎడారి వర్షచ్చాయా ప్రాంతంగా మారింది.
4. AGM విషయంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలేమిటి?
జ:
  • హరిత గృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగం అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలి అని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి.
  • శిలాజ ఇంధనాలు వినియోగించుకోకపోతే తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి.

#Tags