Andhra Pradesh: గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి

కేవీపల్లె : గ్యారంపల్లె ఏపీ గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు.

డిసెంబ‌ర్ 10న‌ గ్యారంపల్లె ఏపీ గురుకుల పాఠశాలలో గురుకుల ఆలుమ్ని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 40 వసంతాల (రూబి జూబ్లీ) వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

చదవండి: Gurukula School jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతరం ఆలుమ్ని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 6 లక్షలు కేటాయించినట్లు చెప్పారు గ్యారంపల్లెలో గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన రెడ్డెప్పరెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులు రూ. 2 లక్షల చెక్‌ను ఆలుమ్ని అసోసియేషన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కియా మోటార్స్‌ ముఖ్య సలహాదారు టి. సోమశేఖర్‌రెడ్డి, ఆలుమ్ని ఉపాధ్యక్షుడు జె. సాల్మన్‌రాజు, పాఠశాల ప్రిన్సిపాల్‌ బ్రహ్మాజి, మాజీ ప్రిన్సిపాల్స్‌ పి. ఓబయ్య, ఎన్‌.వి. రమణ, ఆనందబాబు, సురేష్‌, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

#Tags