10th Class Exam Fee: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

10th Class Exam Fee

విజయనగరం అర్బన్‌: పదో తరగతి ఫెయిలై ప్రైవేటుగా పరీక్షలు రాయనున్న, మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ కావాలన్న విద్యార్థులకు ఫీజు గడువును పొడిగించినట్టు డీఈఓ బి.లింగేశ్వరెడ్డి తెలిపారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ప్రధానోపాధ్యాయుడి స్థాయిలో ఫీజు చెల్లించడానికి ఈ నెల 30 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే తేదీలోగా నామినల్‌ రోల్స్‌, ఇతర డాక్యుమెంట్స్‌ ఆన్‌లైన్‌లో సమర్పించాలని తెలిపారు.

వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు రూ.50, డిసెంబర్‌ 6 నుంచి 11వ తేదీ వరకు రూ.100, 12 నుంచి 16 తేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించవచ్చని సూచించారు. ఒక సబ్జెక్టు పరీక్షకు అయితే రూ.110, మూడు సబ్జెక్టు లు కన్నా ఎక్కువ రాసిన వారు రూ.125, మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ ఫీజు రూ.80 చెల్లించాలని పేర్కొన్నారు. ఫీజును ‘బీఎస్‌ఈ.ఈపీ.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో స్కూల్‌ లాగిన్‌లో మాత్రమే చెల్లించాలని తెలిపారు. సీఎఫ్‌ఎంఎస్‌లో బ్యాంకు చలానాలు అనుమతి లేదని ప్రధానోపాధ్యాయులకు ఆయన తెలియజేశారు.

#Tags