PRASHAST: దివ్యాంగ విద్యార్థుల కోసం ‘ప్రశస్థ్‌’

సాక్షి, అమరావతి: దివ్యాంగులైన విద్యార్థులను గుర్తించడం, వారి చదువుల తీరును విశ్లేషించి.. అవసరమైన సహాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రశస్థ్‌’ అనే యాప్‌ను ప్రవేశపెట్టింది.
దివ్యాంగ విద్యార్థుల కోసం ‘ప్రశస్థ్‌’

దీన్ని పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థుల కోసం నియమితులైన ప్రత్యేక ఉపాధ్యాయులతో డౌన్‌లోడ్‌ చేయించడంతోపాటు విద్యార్థుల సమాచారాన్ని అప్‌­లోడ్‌ చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్లకు సూచనలు జారీ చేసింది. ‘ప్రీ అసెస్‌మెంట్‌ హోలిస్టిక్‌ స్క్రీనింగ్‌ టూల్‌’ (ప్రశస్థ్‌) యాప్‌ గురించి టీచర్లందరికీ తెలియచేయాలని సూచించింది. 21 రకాల అంగవైకల్యాలకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ యాప్‌ ద్వారా కేంద్రం తెలుసుకోనుంది.

చదవండి: Good News: వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంపు

విద్యార్థులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో గుర్తించి.. పరిష్కారాలను చూపేందుకు ఈ ప్రక్రియలో అందరి భాగస్వామ్యాన్ని పెంచనుంది. ఇందుకోసం పాఠశాలల వారీగా నివేదికలను రూపొందింపజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ కోఆరి్డనేటర్లు, టీచర్లు, స్పెషల్‌ ఎడ్యుకేటర్లు, దివ్యాంగుల కోసం నియమితులైన రిసోర్సు పర్సన్లు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), డైట్లు, సీటీఈ, సీమ్యాట్‌ తదితర సంస్థల బోధన సిబ్బంది ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయించాలని పేర్కొంది. అనంతరం దివ్యాంగ విద్యార్థుల వివరాలను నమోదు చేయించాలని తెలిపింది. ఈ వివరాల ఆధారంగా పిల్లలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. 

చదవండి: Study Material: నిరుద్యోగులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌

#Tags