B Lingeswara Reddy: అకడమిక్‌ స్టాండర్డ్స్‌పై రాజీ పడొద్దు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్‌ స్టాండర్డ్స్‌పై రాజీ పడే ప్రసక్తి లేదని పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

పాత బస్టాండ్‌ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్‌లో ఫిబ్ర‌వ‌రి 14న‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆర్జేడీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని ఎంఈఓలకు సూచించారు.

ప్రభుత్వం విద్యా వ్యవస్థలో 20కి పైగా కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. పాఠశాలల్లో ఐఎఫ్‌పీలను పూర్తిస్థాయిలో వినియోగించడంతో పాటు, 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లను విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలలకు తెచ్చి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉపయోగించుకునేలా చూడాలని హెచ్‌ఎంలను కోరారు. ఎంఈఓలు ప్రతిరోజూ ఒక పాఠశాలను ఖచ్చితంగా విజిట్‌ చేయడంతో పాటు పాఠశాలలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింతగా పెరగాలన్నారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన  ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

పాఠశాలల సందర్శన సమయంలో విద్యార్థుల ప్రగతిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. ఉప విద్యాశాఖాధికారులు రెగ్యులర్‌గా పాఠశాలలను తనిఖీ చేయాలని సూచించారు. విద్యార్థుల్లో బేసిక్‌ నాలెడ్జ్‌ పెంపొందించడంతో పాటు సబ్జెక్టు పరంగా పట్టు సాధించే దిశగా ఉపాధ్యాయులతో కలిసి టీం వర్క్‌ చేయాలని హెచ్‌ఎంలకు సూచించారు.

డీఈఓ పి.శైలజ మాట్లాడుతూ టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు హాజరయ్యే విధంగా పర్యవేక్షించాలని హెచ్‌ఎంలకు సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ జి.విజయలక్ష్మి, గుంటూరు, తెనాలి డీవైఈఓలు పి.వెంకటేశ్వరరావు, ఎం.నిర్మల, గుంటూరు ఈస్ట్‌ ఎంఈఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

#Tags