AP 10th Class Re Verification& Recounting: ఏపీ పదో తరగతి జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌

సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు సంబంధించి మరో 10,542 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ పూర్తి చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు. మొత్తం 55,996 మంది రీ వెరిఫికేషన్‌/ రీ కౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

TS Schools Reopening Date and New Timings 2024 : జూన్‌ 12వ తేదీ పాఠ‌శాల‌లు ప్రారంభం.. మారిన స్కూల్స్ టైమింగ్స్ ఇవే.. అలాగే..!

మార్కుల పరిశీ­లన ప్రక్రియ పూర్తిచేసిన 43,714 మంది జవాబు పత్రాలను ఈ నెల 23న ఆయా స్కూళ్లకు ఆన్‌లైన్‌లో పంపించారు. మరో 10,542 మంది జవాబు పత్రాలను సోమ­వారం ఆయా స్కూళ్లకు పంపించగా, మిగిలిన 1,710 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్‌ చేసి త్వరలోనే పంపిస్తామని తెలిపారు.

#Tags