INSPIRE Manak : ఇన్‌స్పైర్‌ మనక్‌ ప్రతిపాదనలకు ఆహ్వానం

వినూత్న ఆలోచనలు చేయడం, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి ఉండి, శాస్త్రవేత్తలుగా రాణించాలనుకునే విద్యార్థులకు ఇన్‌స్పైకర్‌ మనక్‌ మంచి వేదిక.

6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాల తదితర పాఠశాలల విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత పాఠశాలల నుంచి ఐదు చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి మూడు చొప్పున నామినేషన్లను స్వీకరిస్తారు.
పరిశోధనకు ప్రోత్సాహకం
→    జిల్లా స్థాయిలో నిర్వహించిన నమూనా ప్రదర్శనల్లో ఉత్తమంగా ఉన్నవాటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ చాటితే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ స్థాయి ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం పెటెంట్‌ హక్కులను ఇస్తుంది. 
→    జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తే రాష్ట్రపతి, ప్ర­ధానమంత్రిని కలుసుకునే అవకాశం లభిస్తుంది.
→    జాతీయ స్థాయిలో ప్రదర్శనకు ఎంపికైన ప్రాజెక్టులకు సంబంధించిన విద్యార్థులకు రూ.25వేలు వరకు శాస్త్ర, సాంకేతిక మండలిశాఖ అదనపు నిధులను కేటాయిస్తుంది.
దరఖాస్తు ఇలా
2024, సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలి. పాఠశాల అథారిటీ ఐచ్చికాన్ని క్లిక్‌ చేసి వన్‌టైం రిజిస్ట్రేషన్‌ చేసి, పాఠశాల వివరాలను పొందుపర్చాలి. జిల్లా విద్యాశాఖ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఈమెయిల్, యూజర్‌ ఐడీతో లింక్‌ రాగానే పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి. దీని తర్వాత ప్రాజెక్ట్‌ నమూనాకు సంబంధించిన వివరాలను పొందుపర్చాలి.
→    వెబ్‌సైట్‌: https://www.inspireawards-dst.gov.in

Law UG and PG Courses : లా యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు క్లాట్ 2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

#Tags