job Mela: జాబ్‌ మేళా.. ఎంపికైతే నెలకు 15000 జీతం

job mela

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని బలగ హాస్పటల్‌ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్‌టీసీ–ఐటీఐ)లో ఈనెల 19వ తేదీన జాబ్‌ మేళా జరగనుందని డీఎల్‌టీసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వై.రామ్‌మోహనరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ డీఎల్‌టీసీ వేదికగా మేథా సెర్వో డ్రైవ్స్‌ ప్రైవే ట్‌ లిమిటెడ్‌ సంస్థ, హైదరాబాద్‌ వారి ద్వారా నిర్వహించే ఈ మేళాకు ఐటీఐలో ఎంపికచేసిన ట్రేడుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

పాఠశాలలకు, కాలేజీలకు, బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు ప్రకటన: Click Here

వెల్డర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ ట్రేడుల్లో ఉత్తీర్ణులై 25 ఏళ్లలోపు వయ స్సు కలిగిన వారు రావాలన్నారు. జాబ్‌ మేళాకు హాజరైన అభ్యర్థులకు లిఖితపూర్వక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా కంపెనీ ప్రతినిధులు ఎంపిక చేస్తారని ఏడీ రామ్‌మోహనరావు తెలిపారు.

ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.15100 స్టైఫండ్‌తోపాటు ఈఎస్‌ఐ, కంపెనీ ఇతర అలవెన్సులు, సదుపాయా లు ఉంటాయన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు తమ బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌ ఫొటోలతో హాజరుకావాలని ఆయన కోరారు.

#Tags