SBI jobs: డిగ్రీ, BTech అర్హతతో SBI లో భారీగా ఉద్యోగాలు నెలకు జీతం 85,920

SBI jobs

బ్యాంక్‌ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నవారికి శుభవార్త

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్‌ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ ద్వారా స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ 169 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.

10వ తరగతి, Inter పరీక్షల షెడ్యూల్‌ విడుదల: Click Here

మొత్తం ఖాళీల సంఖ్య : 169
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్) పోస్టులు : 42 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఎలక్ట్రికల్)పోస్టులు : 25 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్) పోస్టులు : 101
అసిస్టెంట్ మేనేజర్ బ్యాక్‌లాగ్ ఖాళీలు పోస్టులు : (ఇంజినీర్- సివిల్): 01

ఇతర ముఖ్యమైన సమాచారం:
అర్హతలు: బీఈ/ బీటెక్‌ (సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఫైర్/ సేఫ్టీ అండ్‌ ఫైర్ ఇంజినీరింగ్/ ఫైర్ టెక్నాలజీ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.10.2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు.. ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

బేసిక్ పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటరాక్షన్ ఆధారంగా.. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్-ఫైర్) పోస్టులకు అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీ:
దరఖాస్తులు ప్రారంభ తేది: నవంబర్‌ 22, 2024
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్‌ 12, 2024
ఫీజు చెల్లింపునకు చివరితేది: డిసెంబర్‌ 12, 2024

#Tags