Leaves Rules : ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కావాలంటే.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..! లేకపోతే..
సాక్షి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవు నిబంధనలు 1.6.1972లో అమల్లోకి తెచ్చారు. అయితే, ఇక్కడ ఉన్న పలు రూల్స్ ప్రకారం కొన్ని సెలవులను ఎలా వినియోగించాలో వివరంగా తెలుసుకుందాం..
రూల్ 7 ప్రకారం: సెలవును హక్కుగా పొందలేము.
రూల్ 10 ప్రకారం: సెలవు మంజూరు చేసిన తరువాత మరో రకమైన సెలవుగా మార్చవచ్చు. కాని, ఇది హక్కుగా మాత్రం కాదు.
Students Debarred: డిగ్రీ పరీక్షల్లో 42 మంది డీబార్.. ఎక్కడంటే..
రూల్ 11 ప్రకారం: క్యాజివల్ లీవ్‌ను తప్పితే, మరే సెలవునైనా కలిపి లేదా కొనసాగింపుగా మంజూరు చేయవచ్చు.
రూల్ 12 ప్రకారం: నిరంతరంగా ఐదు సంవత్సరాల మించి సెలవును మాత్రం మంజూరు చేయరాదు.
సెలవు మంజూరు ప్రొసీడింగ్స్‌లో మిగిలిన సెలవు రోజుల సంఖ్యను తప్పనిసరిగా సూచించాలి.
రూల్ 26 ప్రకారం: ఒకేసారి మంజూరు చేసే గరిష్ట ఆర్జిత సెలవు.. ఒకవేళ ఉద్యోగ జీత నష్టపు సెలవులో ఉన్నా లేకపోతే, ఉద్యోగి గైర్హాజరు కాలాన్ని డైస్ నాన్‌గా పరిగణలోకి తీసుకున్నప్పుడు, వారి సెలవులో 1/10 వంతు చొప్పున ఆర్జిత సెలవును తీసేస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
రూల్ 27 ప్రకారం: ప్రతి క్యాలెండర్ నెలకు 21/2 రోజుల చొప్పున ఆర్జిత సెలవును లెక్కిస్తారు. భిన్న భాగాన్ని సమీప రోజుకు రౌండ్ ఆఫ్ చేయాలి.
రూల్ 30 ప్రకారం: వెకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల విషయంలో జనవరి 1, జూలై 1 నాడు రెండు విడుతలుగా 5 రోజుల చొప్పున ఆర్జిత సెలవు అకౌంట్లో జమ చేయాలి. ఒకవేళ ఉద్యోగి వెకేషన్‌ను వదులుకుంటే గరిష్టంగా 20 రోజుల వరకు అదనపు ఆర్జిత సెలవు జమ చేయబడుతుంది. క్యాలెండర్ సంవత్సరంలో జమ చేయబడిన మొత్తం ఆర్జిత సెలవుల సంఖ్య 30 రోజులకు మించకూడదు. వెకేషన్‌ను ఏ రక మైన సెలవుతో కలిపి లేదా ఏ రకమై న సెలవుకు కొనసాగింపుగా మం జూరు చేయవచ్చును.
Job Opportunities : నిరుద్యోగులకు ఈ వెబ్‌సైట్‌తో ఉపాధి అవకాశాలు.. నేరుగా..
లీవ్ నాట్ డ్యూ సెలవు..
ఈ సెలవును రూల్ 31గా పరిగణిస్తారు. దీనిని ఉద్యోగి భవిష్యత్తులో సంపాదించే అర్థవేతన సెలవులో నుండి తీసుకోవాలి. ఇది శాశ్వత ఉద్యోగికి మంజూరు చేస్తారు. దీని నిబంధనలకు లోబడి, ఉద్యోగి సర్వీసులో 360 రోజులకు మించకుండా మెడికల్ సర్టిఫికెట్‌తో మంజూరు చేయవచ్చు.
జీత నష్టపు సెలవు..
ఈ సెలవును ఎక్స్‌ట్రాడినరీ లీవ్‌గా కూడా పిలుస్తారు. ఇందులో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి..
Millet Factory: ఆర్థిక బలం ఇచ్చిన ‘మిల్లెట్ ఫ్యాక్టరీ’.. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి
రూల్ 32 ప్రకారం: తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీసు పూర్తి చేసినట్లయితే జీత నష్టపు సెలవును గరిష్టంగా మూడు లేదా ఆరు నెలలు ఆరోగ్య సమస్యలు కలిగిన వారైతే.. 18 నెలలు, 24 నెలలు.. ఉద్యోగి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఉన్నత చదువులకు మంజూరు చేస్తారు.
రూల్ 33 ప్రకారం: సర్వీస్‌లో ఉన్నప్పుడు ఎల్టిసిని ఉపయోగించే సమయంలో 10 రోజుల వరకు ఆర్జిత సెలవును నగ దుగా చెల్లించడానికి అనుమతిస్తారు. మొత్తం సర్వీస్‌లో ఇలా నగదుగా చెల్లించబడిన సెలవు 60 రోజులకు మించకూడదు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
రూల్ 39 ప్రకారం: ఉద్యోగి ఒకవేళ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన, రాజీనామా చేసిన 150 రోజుల వరకు ఆర్జిత సెలవును నగదుగా చెల్లించడానికి అనుమతించవచ్చును.
రూల్ 39ఏ 39బీ ప్రకారం: ఉద్యోగి మరణించిన సందర్భంలో, మెడికల్ ఇన్వాలిడేషన్‌లో కూడా 300 రోజుల ఆర్జిత సెలవును నగదుగా చెల్లించడానికి అనుమతిస్తారు.
రూల్ 40 ప్రకారం: ఉద్యోగి 30 రోజులకు మించి ఆర్జిత లేదా సగపు జీతపు సెలవును వినియోగించుకుంటే వారికి ఒక నెల జీతంను అడ్వాన్స్‌గా చెల్లించవచ్చు.
Helicopter Equipment: భారత్‌కు రూ.9,900 కోట్ల రక్షణ ఉత్పత్తులు.. అమెరికా అంగీకారం
అర్థ జీతపు సెలవు..
ప్రతి క్యాలెండర్‌లో జనవరి 1, జూలై 1 నాడు రెండు విడుతలుగా 10 రోజుల చొప్పున అర్ధ వేతన సెలవును అడ్వాన్సుగా జమ చేస్తారు. వీటిని నెలకు 5/3గా లెక్కిస్తారు. గరిష్టంగా అర్ధ సంవత్సరానికి 10 రోజులు మాత్రమే.
రూల్ 29 ప్రకారం: అర్ధ వేతన సెలవును జమ చేసేటప్పుడు రోజు భిన్నాన్ని సమీప రోజుకు రౌండ్ ఆఫ్ చేయాలి.
రూల్ 30 ప్రకారం: ఉద్యోగి అర్ధ వేతన సెలవులో సగం మొత్తానికి మించని కమ్యూటెడ్ లీవ్‌ను మెడికల్ సర్టిఫికెట్‌పై మంజూరు చేయవచ్చు. ఈ లీవ్‌ను మెడికల్ సర్టిఫికెట్ లేకుండా కూడా 90 రోజుల వరకు అనుమతించిన చదువు కోసం మాత్రమే కాకుండా 60 రోజుల వరకు మెటర్నిటీ లీవుతో కలిపి మంజూరు చేయవచ్చు.
TGPSC Provisional Selection List: టీజీపీఎస్సీ ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల