Paytm jobs: Paytmలో ఉద్యోగాలు

paytm

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు మూడు ప్రముఖ ప్రైవేట్‌ సంస్థల్లో 205 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.అరుణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెల 4న ఉదయం 10 గంటల నుంచి బీసీ కాలనీలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద జాబ్‌ మేళా నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేళాకు పురుష అభ్యర్ధులు మాత్రమే అర్హులని తెలిపారు. మేళాలో నవత ట్రాన్స్‌పోర్ట్‌, పేటీఎం, ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.

ఆసక్తిగల అభ్యర్థులు ‘ఎన్‌సీఎస్‌.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లోని జాబ్‌ సీకర్‌ లాగిన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. బయోడేటాతోపాటు పాస్‌పోర్ట్‌ ఫొటోతో హాజరుకావాలని సూచించారు.

#Tags