NIA jobs: NIA లో Data Entry Operator ఉద్యోగాలు జీతం నెలకు 70000

NIA jobs

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఉద్యోగం సంపాదించాలని కలలు కనే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. NIA డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మీరు ఈ పోస్ట్‌లకు అప్లై చేయాలి అనుకుంటే NIA అధికారిక వెబ్‌సైట్ nia.gov.inని సందర్శించండి. తద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

డిగ్రీ అర్హతతో NLC India Limited లో భారీగా ఉద్యోగాలు జీతం నెలకు ట్రైనింగ్‌లో 15028: Click Here

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా NIA మొత్తం 33 NIA డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసి NIAలో పని చేయాలనుకుంటే 8 ఫిబ్రవరి 2025న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత:
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఏ అభ్యర్థి అయినా అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి. ముఖ్యంగా అప్లై చేసే వ్యక్తి వయసు 56 ఏళ్లు మించకూడదు. లేదంటే మీ ప్రయత్నం వృథా అవుతుంది.

జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థికి రూ.29200 నుంచి రూ. 92300 (లెవల్-5, గ్రేడ్ పే ₹ 2,800) వరకు చెల్లిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీపీటీ తదితర అలవెన్సులు ఇస్తారు.

దరఖాస్తు :
ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు NIA అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన సర్టిఫికేట్స్ జత చేయండి. దీని తరువాత, నింపిన ఫారమ్, సంబంధిత సర్టిఫికేట్స్‌ను ఒక కవరులో సీలు చేసి దిగువ చిరునామాకు పంపాలి.
SP (పరిపాలన), NIA ప్రధాన కార్యాలయం,
CGO కాంప్లెక్స్, లోధి రోడ్,
న్యూఢిల్లీ - 110003

Official Notification & Application form: Click Here
Official Website: nia.gov.in

#Tags