Jobs in MNC Company: MNC కంపెనీలో ఉద్యోగాలు

Jobs in MNC Company

స్థానిక వైటీసీలో ఈ నెల 9న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ కల్పనాకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.

నెల్లూరు శ్రీసిటీలో క్యాడ్‌బరీ చాక్లెట్‌ తయారు చేసే ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీ మొండేలేజ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలకు ఇంటర్వూలు జరగనున్నాయన్నారు.

ఇంటర్మీడియట్‌ ఆపైన చదివిన వారు ఇంటర్వ్యూలకు అర్హులని స్పష్టం చేశారు. ఎంపికై న వారికి నెలకు రూ.17,500లు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 9150015264 నంబర్‌లో సంప్రదించి దరఖాస్తు చేయాలని సూచించారు.

#Tags