Job mela: జాబ్‌మేళా

Job mela

కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలోని నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో కర్లికల్‌, టెక్నికల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి(క్లరికల్‌) ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అపోలో ఫార్మసీస్‌, వరుణ్‌ మోటర్స్‌, శ్రీరామ్‌ చిట్స్‌, మూత్తూట్‌ ఫైనాన్స్‌, టాటా క్యాపిటల్‌, దక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, స్పెక్టమ్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీల్లో 500 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు.

రిటైల్‌ ట్రైనింగ్‌ అసోసియేట్‌, ఫార్మాసిస్ట్‌, జూనియర్‌ ట్రైనీ, డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌, ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, అకౌంట్స్‌, అసిస్టెంట్‌, రికవరీ, క్లర్క్‌, బ్రాంచ్‌ ఇన్‌చార్జి, వేర్‌హౌస్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఉద్యోగాలకు టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పీజీ, 18–35 ఏళ్ల వయసు గల పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. కంచరపాలెం జిల్లా ఉపాఽధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్‌మేళాకు హాజరు కావాలని కోరారు.

#Tags