Army Recruitment Rally: 26 నుంచి భారీగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Indian Army jobs

మహారాణిపేటపోర్టు స్టేడియంలో ఈ నెల 26 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిరప్రసాద్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆర్మీ, జిల్లా అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌/ స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌లో నియామకాలకు జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Employees transfers Latest news: రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలు: Click Here

ర్యాలీకి 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన యువత హాజరవుతారని.. వారికి అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. స్టేడియం వద్ద తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్‌, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం, మొబైల్‌ టాయిలెట్లు, డస్ట్‌బిన్లు సిద్ధం చేయాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్‌ మళ్లింపు వంటి చర్యలు చేపట్టాలని డీసీపీకి సూచించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అధికారి మేజర్‌ శశాంక్‌, డీఆర్వో కె.మోహన్‌కుమార్‌, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, పోలీసు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

#Tags