AP MSME Parkలతో మారుమూల గ్రామాల్లోని యువకులకు ఉద్యోగ అవకాశాలు

ఆనందపురం : రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ పార్కులు) నెలకొల్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
Govt to set up MSME parks across AP

మండలంలోని కణమాంలో ఏపీఐఐసీకి భూములు అందించిన వంద మంది రైతులకు బుధవారం రూ.28 కోట్ల పరిహార చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని యువకులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. ఇటీవలే జగన్నాథపురంలో గ్రేహౌండ్స్‌ నిమిత్తం భూములు అందించిన రైతులకు రూ.15 కోట్లు చెల్లించామని తెలిపారు.

 AP Paramedical posts: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పారామెడికల్‌ పోస్టులు

కణమాంలో ఏపీఐఐసీ సేకరించిన 157 ఎకరాల్లో ఆటోనగర్‌ ఏర్పాటుతోపాటు, ఎంఎస్‌ఎంఈ పార్కు కూడా ఏర్పాటు చేయనున్నామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనివల్ల ఆనందపురం మండలంలో వందలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా ఐటీఐ, పాలిటెక్నిక్‌ చదివిన వారికి ఉపాధి మెరుగవుతుందన్నారు.

 IAS officer Chakrapani: విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

#Tags