Good News For Women Free Training Courses: ఆధార్‌ కార్డ్‌ ఉంటే చాలు..మహిళలకు ఉచిత శిక్షణ

Women Free Training Latest Courses

అనంతపురం: రూడ్‌సెట్‌ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా టైలరింగ్‌, బ్యూటీ పార్లర్‌ శిక్షణ కల్పిస్తున్నట్లు డైరెక్టర్‌ ఎస్‌. విజయలక్ష్మి తెలిపారు.

ఈ నెల 20 నుంచి 30 రోజుల పాటు శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తామని తెలిపారు.

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన వారై 19 నుంచి 45 సంవత్సరాల్లో వయస్సు ఉన్న మహిళా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు కలిగి ఉండాలన్నారు.

ఆసక్తి గల వారు తమ పేర్లను సెల్‌ నంబర్‌ 9618876060, 9440905479 లను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు.

#Tags