Good news for private employees: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం..ఎలాగో తెలుసుకోండి
మీరు ప్రైవేట్ రంగ ఉద్యోగిగా పనిచేస్తున్నారా..అయితే ఇది మీకు మంచి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారు మాత్రమే మంచి పెన్షన్ తో రిటైర్ అవుతారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగులు సైతం మంచి పెన్షన్‌తో రిటైర్‌మెంట్ పొందే అవకాశం ఇప్పుడు లభించనుంది.
ఇంటర్ అర్హతతో Work From Home jobs జాబ్ గ్యారెంటీ: Click Here
ప్రైవేటు ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన విషయం
రిటైర్మెంట్ తర్వాత సురక్షితంగా గడపాలని చూస్తున్న ప్రైవేటు ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పవచ్చు. కోట్లాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను గణనీయంగా పెంచే చర్యలో ప్రభుత్వం EPFO కోసం జీతం పరిమితిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్
ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఏళ్లుగా యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ (యుపిఎస్) ప్రయోజనాలను అనుభవిస్తున్నారు. అయితే ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులను ఈ పథకంలో చేర్చలేదు. వీరికి దీని నుంచి మినహాయింపు ఉంది. అయితే ఇప్పుడు ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ జీత పరిమితిని పెంచినట్లయితే, ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలోకి ఎక్కువ డబ్బు జమ అవుతుంది. దీంతో ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్‌లో భారీ పెరుగుదల ఉంటుంది.
మెరుగైన సామాజిక భద్రత లభిస్తుంది:
EPF సహకారం పెరిగేకొద్దీ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం బలమైన సామాజిక భద్రతా ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది.
ఆర్థిక భద్రత:
జీతం పరిమితిలో మార్పుతో పాటు ఈ మార్పు వల్ల వృద్ధాప్యంలో ఆర్థిక స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది. అలాగే పదవీ విరమణ తర్వాత భారీ మొత్తంలో డబ్బు ఆదా చేసి కార్పస్ ఫండ్ ఏర్పాటులో కూడా ఇది సహాయపడుతుంది.
ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఎంత చెల్లించాలి పరిమితి ఎంత పెరుగుతుంది?
దీనికి సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనను సమర్పించింది. EPFO కోసం వేతన పరిమితిని ప్రస్తుత రూ.15,000 నుండి రూ.21,000కి పెంచాలని సిఫార్సు చేసింది.
➤ ఈ పెంపు అమలైతే ప్రైవేట్ రంగ ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది.
➤ ఈ పెంపుతో ప్రైవేట్ రంగ ఉద్యోగులు తమ నెలవారీ పెన్షన్‌లో గణనీయమైన పెరుగుదలను ఆశించవచ్చు.
➤ పదవీ విరమణ తర్వాత, వారు నెలకు రూ.10,050 వరకు పెన్షన్ పొందవచ్చు.
➤ అయితే, దీని కారణంగా, టేక్ హోమ్ జీతం కొద్దిగా తగ్గవచ్చు.
➤ కానీ ఇది ఉద్యోగుల భవిష్యత్‌లో విలువైన పెట్టుబడి అవుతుంది.
ఉద్యోగుల జీతాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
జీతం పరిమితిని పెంచినట్లయితే, ఉద్యోగి నెలవారీ జీతంలో ఎక్కువ భాగం EPF మొత్తానికి చెల్లించాల్సి రావచ్చు. ఇది మీ జీతంలో కొంచం తగ్గుతుంది. అయితే, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో ప్రభుత్వ తుది నిర్ణయం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.