Telangana Anganwadi 11000 Posts Notification: గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీలో 11వేల ఉద్యోగాలు

Anganwadi jobs news

తెలంగాణలో 11,000 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 11,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. 11వేల అంగన్‌వాడీ ఉద్యోగాలకు పైగా త్వరలోనే నోటిఫికేషన్‌ ఇస్తామని..ఇత కొన్ని రోజుల క్రితం మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. కానీ మాటలకే పరిమితం అయ్యిందికానీ ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Teacher Jobs Notification: భారీగా ఉపాధ్యాయ పోస్టులు: Click Here

ఉద్యోగాల భర్తీ
ఈ 11,000 అంగన్‌వాడీ పోస్టులను ఒకేసారి భర్తీ చేస్తామని మంత్రి అన్నారు. ఈ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 35,000 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, 15,000 కేంద్రాల్లో నర్సరీ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పాఠశాలల కోసం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇంగ్లీష్ బోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు.

అంగన్‌వాడీ ఉద్యోగాల అర్హతలు
అంగన్‌వాడీ టీచర్ మరియు హెల్పర్లుగా నియమితులయ్యే అభ్యర్థులు కనీసం ఇంటర్‌ ఉత్తీర్ణతై ఉండాలని నిబంధన పెట్టారు. గతంలో టీచర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలని నిబంధన ఉండేది.

వయోపరిమితి
ఈసారి అంగన్‌వాడీ ఉద్యోగాల వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి. 65 ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించకూడదు. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది.

రిటైర్మెంట్ ఫండ్స్
తెలంగాణ అంగన్‌వాడీ ఉద్యోగులు రిటైర్మెంట్ సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.1లక్ష ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తామ‌ని, తద్వారా పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేరతార‌ని ఆమె చెప్పారు.


ఫర్నిచర్ సమకూర్పు
తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాలకు ఫర్నిచర్ మరియు ఇతర అవసరమైన సామగ్రిని సమకూర్చామని ఆమె చెప్పారు.

#Tags